సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kangana Ranaut: ‘మతాన్ని వాడుకుంటోంది’.. కంగనాపై బిగ్‌బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-30T12:56:44+05:30

బాలీవుడ్‌లో వివాదాలు అంటూ గుర్తొచ్చే పేర్లు కంగనా రనౌత్ (Kangana Ranaut), ఉర్ఫీ జావేద్ (Urfi Javed). వీరిద్దరూ కూడా చాలా వివిధ అంశాలపై బోల్డ్‌గా మాట్లాడుతూ..

Kangana Ranaut
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో వివాదాలు అంటూ గుర్తొచ్చే పేర్లు కంగనా రనౌత్ (Kangana Ranaut), ఉర్ఫీ జావేద్ (Urfi Javed). వీరిద్దరూ కూడా చాలా వివిధ అంశాలపై బోల్డ్‌గా మాట్లాడుతూ.. వివాదాల పాలవుతూ ఉంటారు. తాజాగా ఫైర్‌బ్రాంగ్ కంగనాపై బిగ్‌బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియా వేదికగా సంచలన విమర్శలు చేసింది.

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ తరుణంలో ఈ మూవీని ఉద్దేశించి ఓ నెటిజన్ భారతదేశం సెక్యులర్ అంటూ ఓ ట్వీట్ చేసింది. దానిపై కంగనా స్పందిస్తూ.. ఈ దేశం ఖాన్‌లని, ముస్లిం నటీమణులను మాత్రమే ప్రేమిస్తుంది అని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో చాలామంది కంగనాని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా కంగనాపై హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ విమర్శలు చేసింది.

ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీలో.. ‘ఏంటిది! ఈ ముస్లిం నటులు, హిందు నటులు ఏంటి?. కళని మతాన్ని బట్టి వేరు చేయొద్దు. ఇక్కడ కేవలం నటులు మాత్రమే ఉంటారు.

కంగనా ట్వీట్‌ని జీర్ణించుకోడం కష్టంగా ఉంది. తను ముస్లిం కాదు. కాబట్టి తని సినిమాలని చూడమని చెబుతోంది. వావ్’ అని వ్యంగంగా రాసుకొచ్చింది.

Updated Date - 2023-01-30T12:56:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!