uorfi javed: బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ అరెస్ట్?.. షాక్‌లో కుర్ర‌కారు

ABN , First Publish Date - 2023-11-03T17:26:27+05:30 IST

ఉర్ఫీ జావెద్.. ఈ న‌టి పేరు వింటేనే చాలు కుర్ర‌కారులో ఎన‌లేని ఉత్సాహం వ‌స్తుంది.పెద్ద వారు సిగ్గుతో స‌స్తారు. అంత‌లా ఈ అమ్మ‌డు ఫేమ‌స్‌. అయితే శుక్ర‌వారం ఈ అమ్మ‌డిని ఓ రెస్టారెంట్‌లో ఉండ‌గా ఇద్ద‌రు ముంబ‌య్‌ మ‌హిళా పోలీసులు ఆరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

uorfi javed: బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ అరెస్ట్?.. షాక్‌లో కుర్ర‌కారు
uorfi javed

ఉర్ఫీ జావెద్ (Urfi Javed).. ఈ న‌టి పేరు వింటేనే చాలు కుర్ర‌కారులో ఎన‌లేని ఉత్సాహం వ‌స్తుంది.పెద్ద వారు సిగ్గుతో స‌స్తారు. అంత‌లా ఈ అమ్మ‌డు ఫేమ‌స్‌. ఈమె పెద్ద సినిమా న‌టో, మోడ‌లో అనుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఈ సుంద‌రి ఇప్ప‌టి వ‌ర‌కు టెలివిజ‌న్ సిరీస్‌ల‌లో మాత్ర‌మే న‌టించింది. కానీ సోష‌ల్‌ మీడియాలో త‌న ఫొటోలు, వీడియోల‌తో ఈ బోల్డ్ బొమ్మ చేసే రచ్చ మాములుగా ఉండ‌దు. అవి చూడ‌లేక‌ మ‌గాళ్లే సిగ్గుతో తలదించుకుంటారంటే అతిశ‌యోక్తి కాదు.

urfi.jpg

మొద‌టి నుంచి వివాదాస్ప‌ద యువ‌తిగా పేరు తెచ్చుకున్న ఉర్ఫీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగింది. త‌న‌ డిగ్రీ అనంత‌రం సీరియ‌ల్స్‌ల‌లో న‌టిస్తూ తోటి యాక్ట‌ర్‌తో కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసి బ్రేక‌ప్ చెప్పింది. ఆ త‌ర్వాత నేను ముస్లిం, హిందూ మ‌తాల‌ను అనుస‌రించ‌నని, ముస్లిం వ్య‌క్తిని పెళ్లి చేసుకోనంటూ 2021లో వివాదాల్లో ఎక్కింది. ఇక అప్ప‌టినుంచి రోజూ ఎక్క‌డో ఓ చోట త‌న వింత ప్ర‌వ‌ర్త‌న‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్న‌ది. అడ‌పాద‌డ‌పా వెబ్‌సీరిస్‌ల‌లో న‌టిస్తూ, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజ‌న్ 1లో పాల్గొని అందులో త‌న‌దైన వెరైటీ డ్రెస్సింగ్‌తో యువ‌త‌లో పేరు సంపాదించింది.

urfi-javed.jpg

ఇక అందులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌ ఫుల్ టైం సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ అవ‌తారం ఎత్తి నానా హంగామా చేస్తూ వ‌స్తుంది. త‌న‌కు తానే మోడ‌ల్‌గా మారి ఆ స‌మ‌యానికి ఏ విష‌యం ట్రెండింగ్‌లో ఉంటుందో దానిని వంటిపై వేసుకుని ప‌బ్లిక్ ప్రాంతాల్లో తిరుగుతూ ఫేమ‌స్ అయింది. యాపిల్స్‌, ఆనియ‌న్స్‌, కీ బోర్డు, ష‌ర్ట్ బ‌ట‌న్స్‌, మొబైల్స్ ఇలా ఆ టైంకి ట్రెండింగ్‌లో ఉన్న అంశాన్ని త‌న వ‌స్త్రాలుగా డిజైన్ చేయించుకుని అర్ధ‌న‌గ్నంగా ప్ర‌ద‌ర్శిస్తూ త‌న ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ ఉంటుంది. దీంతో ఈ అమ్మ‌డిని ఇన్‌స్టాలో ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ 4.2 మిలియ‌న్స్‌కు చేరింది.


అదే స‌మ‌యంలో ఆమెపై కొంత‌మంది తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డుతున్నారు. ముస్లిం కుటుంబంలో పుట్టి వారి ప‌రువు, మ‌ర్యాద‌ల‌ను నాశ‌నం చేస్తున్న‌ద‌ని కొంత‌మంది, దేశ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను మ‌ట్టు బెడుతున్న‌దంటూ మ‌రి కొంతమంది దుయ్య‌బ‌డుతున్నారు. ప్ర‌భుత్వం, పోలీసులు, సంఘాలు ఈమెపై ప్ర‌త్యేక దృష్టి సారించాలంటూ చాలామంది స్టేష‌న్‌లో కంప్లైంట్లు ఇవ్వ‌డం, లెట‌ర్స్ రాయ‌డం కూడా జ‌రిగింది.

u-javed.jpg

ఈ క్ర‌మంలో ఈ రోజు (శుక్ర‌వారం) ఉర్ఫీ జావెద్ ఓ రెస్టారెంట్‌లో ఉండ‌గా ఇద్ద‌రు ముంబ‌య్‌ మ‌హిళా పోలీసులు ఆమెను ఆరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుండ‌డంతో ఆ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. మ‌రికొంత‌మంది అది కేవ‌లం ఫ్రాంక్ అని పేరు కోసం అలా ప‌బ్లిక్‌గా చేస్తుందంటూ విమ‌ర్శిస్తున్నారు. ఇంత‌కు అరెస్టు నిజ‌మేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-11-03T17:31:47+05:30 IST