The Kerala Story -Britain: ప్రదర్శన నిలిపేయాలంటూ బెదిరింపులు.. అయినా తగ్గట్లేదు!

ABN , First Publish Date - 2023-05-27T10:55:45+05:30 IST

‘ద కేరళ స్టోరీ’ సినిమా ట్రైలర్‌ విడుదలై, రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది మొదలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. కేరళతోపాటు, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఈ చిత్రాన్ని నిషేదించాలని డిమాండ్‌ చేశాయి. కేరళ ప్రభుత్వంతోపాటు అక్కడి ప్రజలు కూడా ఆ సినిమా విడుదల అడ్డుకోవాలని ప్లాన్‌ చేశాయి.

The Kerala Story -Britain: ప్రదర్శన నిలిపేయాలంటూ బెదిరింపులు.. అయినా తగ్గట్లేదు!

‘ద కేరళ స్టోరీ’ (The kerala story) సినిమా ట్రైలర్‌ విడుదలై, రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది మొదలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. కేరళతోపాటు, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఈ చిత్రాన్ని నిషేదించాలని డిమాండ్‌ చేశాయి. కేరళ ప్రభుత్వంతోపాటు అక్కడి ప్రజలు కూడా ఆ సినిమా విడుదల అడ్డుకోవాలని ప్లాన్‌ చేశాయి. కోర్టు కూడా సినిమాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఎట్టకేలకు ఈ నెల 5న సినిమా విడుదలైంది. సూపర్‌ సక్సెస్‌ అయ్యి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అంతే కాదు ఈ నెల 12వ తేదిన 40 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల సినిమా చేయగా అక్కడ కూడా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. బ్రిటన్‌లోని మిడ్‌ల్యాండ్‌లో ముస్లిం కమ్యూనిటీల ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్కడి థియేటర్స్‌లో ఈ చిత్ర ప్రదర్శనను రద్దు చేశారు. (UK cinema chains cancel The Kerala Story)

యు.కె డిస్ట్రిబ్యూటర్‌ 24 సెవెన్‌ ఫ్లిక్స్‌4 యు డైరెక్టర్‌ సురేష్‌ వర్సాని మాట్లాడుతూ ‘‘లైట్‌ సినిమాస్‌, ఇండిపెండెంట్‌ సినిమాలను బ్రాడ్‌ఫోర్డ్‌ - వాల్సాల్‌ వంటి ప్రదేశాలలో శుక్రవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. షెడ్యూల్‌ చేసిన ఐదు సినిమాలకు ఇలా జరిగింది. ఇండిపెండెంట్‌ సినిమా చైన్‌, రీల్‌ సినిమాస్‌ కూడా బర్న్లీ బ్లాక్‌బర్న్‌లలో ‘ద కేరళ స్టోరీ’ సినిమాను రద్దు చేశారు. మిడ్‌లాండ్స్‌లోని షోకేస్‌ సినిమాస్‌ చైన్‌ దానిని ప్రదర్శిస్తామని చెప్పి, ఆపె ఆ మాటను వెనక్కి తీసుకుంది. స్థానికి ముస్లిం సంఘాలు ఆందోళనలకు దిగనున్న నేపథ్యంలో సినిమాను నిలిపివేశారు. (Director Sudipto sen) బర్మింగ్‌హామ్‌కు చెందిన జమ్మూ కాశ్మీర్‌ లిబరేషన్‌ కౌన్సిల్‌ అధినేత నజీబ్‌ అఫ్సర్‌ కుమారుడు షకీల్‌ అఫ్సర్‌ ఇటీవల సినీవరల్డ్‌ బర్మింగ్‌హామ్‌లో స్ర్కీనింగ్‌కు అంతరాయం కలిగించడంతో థియేటర్‌ సిబ్బంది తమ భద్రత గురించి ఆందోళన చెందుతోంది, లీసెస్టర్‌లో సినిమా ప్రదర్శన జరుగుతున్న ఓ థియేటర్‌లో మేనేజర్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. సినిమా ప్రదర్శన జరిగితే 200 మందిని వచ్చి థియేటర్‌ఉ విఽధ్వంసం చేస్తారు అని హెచ్చరించారు. అయితే ఆ థియేటర్‌ మాత్రం పోలీస్‌ రక్షణతో సినిమా ప్రదర్శన కొనసాగిస్తూనే ఉంది. బెదిరింపు కాల్స్‌ వల్ల నార్త్‌ యు.కెలో మాత్రమే విడుదల చేశా. దీని. వల్ల రూ.(రూ. 1.5 కోట్లు నష్టపోయాను’’ అని వర్షాని అన్నారు.

Updated Date - 2023-05-27T10:57:54+05:30 IST