Tiger 3 : ఫ్యాన్స్ పరాకాష్ట.. భయభ్రాంతులతో థియేటర్‌ నుంచి పరుగులు!

ABN , First Publish Date - 2023-11-13T15:45:41+05:30 IST

ఒక్కోసారి అభిమానుల అభిమానం పరాకాష్టకు చేరుతుంది. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా సల్మాన్ అభిమానులు చేసిన ఓ పని థియేటర్‌లో ఆడియన్స్ భయభ్రాంతులకు గురిచేసింది. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్‌ 3’ ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Tiger 3 :  ఫ్యాన్స్ పరాకాష్ట.. భయభ్రాంతులతో థియేటర్‌ నుంచి పరుగులు!


ఒక్కోసారి అభిమానుల అభిమానం పరాకాష్టకు చేరుతుంది. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా సల్మాన్ అభిమానులు చేసిన ఓ పని థియేటర్‌లో ఆడియన్స్ (Salman Fans Hungama) భయభ్రాంతులకు గురిచేసింది. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్  ఖాన్  హీరోగా నటించిన ‘టైగర్‌ 3’ (Tiger 3) ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో దురు చూస్తున్న అభిమానులు థియేటర్‌లో బొమ్మ చూసేసరికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సినిమా రిలీజ్‌ సందర్భంగా థియేటర్‌ ముందు కటౌట్లు పెట్టి, బాణాసంచా కాల్చుతూ హంగామా చేశారు. అంతటితో ఆగకుండా కొందరు అత్యుత్సాహంతో ఏకంగా థియేటర్‌ లోపల కూడా టపాసులు పేల్చారు. దాంతో భయభ్రాంతులకు గురైన ఆడియన్సు  సీట్లలో నుంచి చెల్లాచెదురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు. మహారాష్ట్ర మాలేగావ్‌లోని మోహన్‌ సినిమా థియేటర్‌లో ఈ సంఘటన జరిగినట్లు బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఫ్యాన్స్ చేసిన చేష్టలకు అభిమానులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున సీట్లకో, కార్పెట్‌కో నిప్పు అంటుకుంటే థియేటర్‌లో ఉన్న ప్రేక్షకుల పరిస్థితి ఏంటని  మండిపడుతున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఎవరినీ రిస్క్‌లో పెట్టొద్దు..  సల్మాన్ స్పందన

థియేటర్‌లో అభిమానులు చేసిన హంగామా సల్మాన్ ఖాన్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ' టైగర్‌ -3’ ప్రదర్శితమవుతున్న థియేటర్‌లో బాణాసంచా పేల్చిన విషయం నాకు తెలిసింది. అది ఎంతో ప్రమాదకరం. ఇలాంటి పనులు చేసి థియేటర్‌లో ఎవరినీ రిస్క్‌లో పెట్టొద్దు. ప్రశాంతంగా సినిమాను ఎంజాయ్‌ చేయండి. సేఫ్‌గా ఉండండి’’ అని సల్మాన్ ఖాన్  ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.


యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన భారీ యాక్షన్‌ చిత్రానికి మనీష్‌ శర్మ దర్శకుడు. సల్మాన్‌ సరసన కత్రినా కైఫ్‌ నటించగా.. ఇమ్రాన్‌ హష్మీ నెగటివ్‌ రోల్‌ చేశారు. 2017లో సల్మాన్‌, కత్రినాల కాంబినేషనలో వచ్చిన హిట్‌ చిత్రం ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌ ఇది.

Updated Date - 2023-11-13T15:57:26+05:30 IST