The Kerala story New Chapter: కొత్త చాప్టర్‌ మొదలైంది

ABN , First Publish Date - 2023-05-12T13:40:31+05:30 IST

వివాదాల నడుమ విడుదలై విజయం సాధించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో, రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది.

The Kerala story New Chapter: కొత్త చాప్టర్‌ మొదలైంది

వివాదాల నడుమ విడుదలై విజయం సాధించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). భారతీయ చలన చిత్ర పరిశ్రమలో, రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. కేరళ ప్రభుత్వంతో పాటు ప్రజలు ఈ చిత్రం విడుదల నిలిపేయాలంటూ డిమాండ్‌ చేశారు. కొన్ని ప్రభుత్వాలు నిషేదం విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పన్ను రాయితీ కల్పించారు. ఇన్ని వివాదాల నడుమ ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒక వర్గం ప్రేక్షకులు, ప్రభుత్వాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన రోజుల్లో దాదాపు 80 కోట్లు వసూళ్లు రాబట్టంది. త్వరలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే దిశగా ఈ చిత్రం పరుగులు తీస్తోంది. ఈ నెల 12 నుంచి 37 దేశాల్లో ఈ చిత్రం విడుదల కానుందని నటి అదాశర్మ (Adha Sharma)సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా దర్శకుడు సుదీప్తో సేన్‌ మరో అప్‌డేట్‌ ఇచ్చారు. ‘‘ఇండియాలో ఈ చిత్రాన్ని 60 లక్షలకు పైగా ప్రేక్షకులు వీక్షించారు. ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త చాప్టర్‌ ప్రారంభం కాబోతుంది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ఇప్పుడు 40కి పైగా దేశాల్లో విడుదల కానుంది. ఈ సంఖ్య పెరగొచ్చు కూడా. ప్రేక్షకులు చూపించే ఆదరణ, ప్రేమాభిమానాలే దీనికి కారణం. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది’’ అని సుదీప్తోసేన్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో ఉన్నికృష్ణన్‌ పాత్రను పోషించడం బలమైన ముద్ర వేసిందని నటి అదాశర్మ తెలిపారు. ఈ పాత్ర నా గుండెలోతుల్లోకి చొచ్చుకెళ్లింది అని పేర్కొన్నారు. తనపై ప్రేక్షకులు కురిపిస్తోన్న ప్రేమ అపూర్వమైందని చెప్పారు. అదాశర్మ, సిద్ది ఇద్నానీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సుదీప్తో ేసన్‌ తెరకెక్కించారు. (Sudipto sen)

కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించిన, వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమాని రూపొందించారు. నలుగురు యువతులు మతం మారి, ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో నడిచే కథ ఇది. తప్పిపోయిన అమ్మాయిలు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో సినిమా ఉండడంతో వివాదానికి దారితీసింది.

Updated Date - 2023-05-12T13:40:31+05:30 IST