OTT : The Kashmir Files.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..!

ABN , First Publish Date - 2023-11-23T18:37:22+05:30 IST

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) సక్సెస్‌ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా అవన్నీ కాదనుకుని దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The vaccine war) .

OTT :  The Kashmir Files.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..!

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) సక్సెస్‌ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా అవన్నీ కాదనుకుని దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ (The vaccine war) . అనుపమ్‌ ఖేర్‌, నానా పటేకర్‌(The kashmir files), పల్లవి జోషి ఈ సినిమాలో కీలక పాత్రలు పాత్రలు పోషించారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. భారతీయ శాస్త్రవేత్తల నిజమైన కథల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు

కరోనా విజృంభించిన తరుణంలో దానిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు ఎలా అభివృద్థి చేశారన్న అంశాన్ని ఈ చిత్రంలో చూపించారు. థియేటర్స్‌లో మిశ్రమ స్పందనకే పరిమితమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్థమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 24వ తేదీ నుంచి స్ర్టీమింగ్‌ కానుంది. ప్రస్తుతం హిందీలోనే ఇది అందుబాటులో ఉంటుందని డిస్నీ+హాట్‌స్టార్‌ తెలిపింది.

Updated Date - 2023-11-23T18:37:29+05:30 IST