Suhana Khan : తండ్రి సినిమాతో కూతురు ఎంట్రీ!

ABN , First Publish Date - 2023-10-19T13:35:52+05:30 IST

జనవరిలో ‘పఠాన్‌’(Pathann), తాజాగా ‘జవాన్‌’ (Jawan) చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ . ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన సుహానా ఖాన్‌తో (suhana khan) కలిసి ఓ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తునట్లు బాలీవుడ్‌ మీడియా చెబుతోంది.

Suhana Khan : తండ్రి సినిమాతో కూతురు ఎంట్రీ!

జనవరిలో ‘పఠాన్‌’(Pathann), తాజాగా ‘జవాన్‌’ (Jawan) చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ . ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన సుహానా ఖాన్‌తో (suhana khan) కలిసి ఓ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తునట్లు బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని సుజోయ్‌ ఘోష్‌ తెరకెక్కిస్తున్నారు. షారుక్‌, సుహానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్  థ్రిల్లర్‌ వచ్చే ఏడాది నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు స్క్రిప్ట్  దశలో ఉంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి యాక్షన్‌ సన్నివేశాలను దాదాపు 6 నెలలపాటు విదేశాల్లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్‌ ‘డంకీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Updated Date - 2023-10-19T13:35:52+05:30 IST