Mission Majnu: పాకిస్తాన్‌లో ఇండియా చేపట్టిన అత్యంత కఠినమైన మిషన్!
ABN , First Publish Date - 2023-01-09T18:56:28+05:30 IST
రియల్ ఘటనలను ఆధారంగా చేసుకుని మిషన్ మజ్ను రూపొందినట్టు తెలుస్తోంది. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కింది. ఇండియా చేపట్టిన ఓ కఠినమైన మిషన్‌ను ఈ చిత్రంలో చూపించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది.

గూఢచార్యం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ కోవలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. భారీ వసూళ్లను రాబట్టాయి. ‘బేబీ’, ‘రాజీ’ వంటి మూవీస్ స్పై ఏజెంట్స్ నేపథ్యంతోనే తెరకెక్కి భారీగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టాయి. తాజాగా మరో సినిమా ఇదే బాటలో వస్తుంది. వివరాల్లోకి వెళ్లితే.. సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం మిషన్ మజ్ను (Mission Majnu). సిద్దార్థ్ ఈ చిత్రంలో స్పై ఏజెంట్ పాత్రను పోషించాడు. పాకిస్తాన్‌లో గూఢచార్యం చేసే వ్యక్తిగా కనిపించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 20న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా జనవరి 9న ట్రైలర్‌ను విడుదల చేశారు.
రియల్ ఘటనలను ఆధారంగా చేసుకుని మిషన్ మజ్ను రూపొందినట్టు తెలుస్తోంది. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కింది. ఇండియా చేపట్టిన ఓ కఠినమైన మిషన్‌ను ఈ చిత్రంలో చూపించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. ప్రేమ, త్యాగం, ద్రోహం అన్ని రకాల భావోద్వేగాలను ట్రైలర్‌లో చూపించారు. పాకిస్తాన్ తయారు చేసిన న్యూక్లియర్ బాంబును భారత్ ఏ విధంగా కనిపెట్టిందనేది ఈ మూవీలో చూపించబోతున్నారు. సిద్దార్థ్ ప్రియురాలి పాత్రను రష్మిక మందన్నా పోషించింది. ‘మిషన్ మజ్ను’ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో జనవరి 20 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాలో పర్మిత్ సేతి, షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, జాకీర్ హుస్సేన్, మిర్ సర్వర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.