Shreyas Talpade : శ్రేయాస్ ఆరోగ్యం.. డాక్టర్లు ఏమన్నారంటే!
ABN , First Publish Date - 2023-12-16T10:11:06+05:30 IST
బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే (Shreyas Talpade) ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ‘ఓం శాంతి ఓం’, ‘గోల్‌మాల్’ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రేయాస్.

బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే (Shreyas Talpade) ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ‘ఓం శాంతి ఓం’, ‘గోల్‌మాల్’ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రేయాస్. ‘పుష్ప: ది రైజ్’ (Pushpa)సినిమా హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పిందే ఈయనే. గురువారం ఆయన గుండెపోటుకు గురికావడంతో సన్నిహితులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండదని, రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.
‘ప్రస్తుతం శ్రేయస్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రోజంతా షూటింగ్‌లో పాల్గొని సాయంత్రం ఇంటికొచ్చిన కాసేపటికి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో తనని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య దీప్తి కూడా సోషల్ మీడియా వేదికగా శ్రేయాస్ ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చింది.