Shivangi joshi: ఆస్పత్రి పాలైన నటి!
ABN , First Publish Date - 2023-03-16T19:18:19+05:30 IST
హిందీ నటి, సూపర్‌హిట్ సీరియల్ ‘బాలికా వధూ-2’ ఫేం శివాంగి జోషి ఆస్పత్రి పాలయ్యారు.

హిందీ నటి, సూపర్‌హిట్ సీరియల్ ‘బాలికా వధూ-2’ (Balika Vadhu 2) ఫేం శివాంగి జోషి (Shivangi joshi) ఆస్పత్రి పాలయ్యారు. రెండ్రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేసి తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ‘అందరికీ నమస్తే. కిడ్నీ ఇన్‌ఫెక్షన్ (kidney infection) కారణంగా రెండు రోజులుగా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నా. హాస్పిటల్‌లో చేరా. నా కుటుంబం, స్నేహితులు, డాక్టర్లు, స్టాఫ్ సపోర్ట్‌తో కోలుకున్నా’’ అని తెలిపారు. ఆరోగ్యంపట్ల శ్రద్థ తీసుకోండి అంటూ శివాంగి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు(shivangi joshi hospitalized). ‘ఖెల్తి హై జిందగి ఆంఖ్ మిచోలీ’ సీరియల్‌తో నటిగా కెరీర్ మొదలెట్టిన శివాంగి ఆ తర్వాత ‘లవ్ బై ఛాన్స్’, ‘ప్యార్ తునే క్యా కియా’ తదితర సీరియల్స్‌లో నటించారు. ‘బాలికా వధూ 2’తో విశేష గుర్తింపు పొందారు. పలు వెబ్ సిరీస్‌ల్లో నటించిన శివాంగి ‘బారిష్’, ‘ఆషికీ’, ‘తూ మేరా సనమ్’ వంటి మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించారు.