Happy Birthday SRK: షారుఖ్ జ‌న్మ‌దినం.. ఎగ‌బ‌డ్డ జ‌నం

ABN , First Publish Date - 2023-11-02T10:13:58+05:30 IST

2018 త‌ర్వాత‌ సినిమాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు వ‌రుస విజ‌యాల‌తో మంచి జోష్ మీద ఉన్నారు. దీంతో అభిమానుల సంద‌డికి హద్దే లేకుండా పోయింది. రెండు రోజుల ముందు నుంచే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు ముంబైకి చేరుకుని క‌నివినీ ఎరుగ‌ని హంగామా చేస్తున్నారు.

Happy Birthday SRK: షారుఖ్ జ‌న్మ‌దినం.. ఎగ‌బ‌డ్డ జ‌నం
shah rukh jhan

బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ఖాన్‌(Shah Ruhk Khan) గురువారం 58వ‌డిలోకి అడుగుపెట్టాడు. ఈయేడాది ఈ జ‌న్మ‌దినం షారుఖ్‌కు చాలా ప్ర‌త్యేకం కానుంది. 2018 త‌ర్వాత‌ సినిమాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు వ‌రుస విజ‌యాల‌తో మంచి జోష్ మీద ఉన్నారు. ఈ యేడు ఇప్ప‌టికే ప‌ఠాన్‌, జ‌వాన్ సినిమాలు విడుద‌లై చెరో వెయ్యి కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసి బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌గా ముచ్చ‌ట‌గా మూడో చిత్రం డ‌న్‌కీ డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

టీవీ సీరియ‌ల్స్ నుంచి వ‌చ్చి బాలీవుడ్‌ను పాలించే స్థాయికి ఎదిగిన విధానం అన‌న్య సామాన్యం. పూట గ‌డ‌వ‌ని ప‌రిస్థితి నుంచి నేడు ఒక్క సినిమాతో వెయ్యి కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టే రేంజ్‌కి చేరుకుని ఇప్పుడు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన న‌టుల్లో ఒక‌డిగా పేరు సంపాదించాడు. ఈ క్ర‌మంలో ఈ రోజు (న‌వంబ‌ర్ 2) షారుఖ్ పుట్టిన రోజు కావ‌డంతో అభిమానుల సంద‌డికి హద్దే లేకుండా పోయింది.

రెండు రోజుల ముందు నుంచే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు ముంబైకి చేరుకుని క‌నివినీ ఎరుగ‌ని హంగామా చేస్తున్నారు. నిన్న రాత్రి వేల సంఖ్య‌లో ఫ్యాన్స్ షారుఖ్ ఇంటికి చేర‌కుని జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ సంబురాలు చేసుకోగా ఆయ‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఇంటి ప్ర‌హరీపై నిల‌బ‌డి అభిమానుల‌కు అభివాదాలు చేశాడు, కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


అయితే షారుఖ్ జ‌న్మ‌దినం సంద‌ర్భ‌గా సెప్టెంబ‌ర్‌లో విడుద‌లై 1100కోట్ల‌కు పైగా రాబ‌ట్టిన జ‌వాన్(jawan) చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేయ‌గా డిసెంబ‌ర్‌లో విడుద‌ల కావాల్సి ఉన్న‌ డ‌న్‌కీ చిత్రం టీజ‌ర్‌ను గురువారం ఉద‌యం విడుద‌ల చేశారు. ఈ డ‌న్కీ(Dunki) చిత్రానికి త్రీ ఇడియ‌ట్‌, మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాల‌ను రూపొందించిన రాజ్ కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా తాప్సీ, బోమ‌న్ ఇరానీ వంటి ఆగ్ర న‌టులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

Updated Date - 2023-11-02T10:16:13+05:30 IST