Aryan Khan: యాటిట్యూడ్‌కి ఏమాత్రం తక్కువ లేదు.. షారుఖ్‌ ఖాన్ తనయుడిపై విపరీతమైన ట్రోలింగ్

ABN , First Publish Date - 2023-02-01T15:20:57+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న స్టార్ కిడ్స్‌లో ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఒకరు.

Aryan Khan: యాటిట్యూడ్‌కి ఏమాత్రం తక్కువ లేదు.. షారుఖ్‌ ఖాన్ తనయుడిపై విపరీతమైన ట్రోలింగ్
Aryan khan

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న స్టార్ కిడ్స్‌లో ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఒకరు. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తనయుడిగా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ యువకుడి పేరు తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇంతకుముందు ఈ నటుడు ముంబై డ్రగ్స్ కేసు (Drugs case)లో జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. అనంతరం తీర్పు అతనికి అనుకూలంగా రావడంతో బయటికి వచ్చాడు. అయితే.. అప్పటి నుంచి చాలా అరుదుగా బయట కనిపిస్తున్నాడు.

తాజాగా అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘ఆల్‌మోస్ట్ ప్యార్ విత్ డీజే మోహబత్’ (Almost Pyaar featuring DJ Mohabbat) స్రీనింగ్ ముంబైలో జరిగింది. దీనికి ఆర్యన్ ఖాన్ హాజరయ్యాడు. ఆ సమయంలో ఆర్యన్‌ని ఫొటోలు తీయడానికి మీడియా ప్రయత్నించింది. అయితే ఆర్యన్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

aryan2.jpg

‘ఏం లేకున్న యాటిట్యూడ్‌కి మాత్రం తక్కువ లేదు. మీ నాన్నని చూసి నేర్చుకో’.. ‘చాలా చెత్త యాటిట్యూడ్. షారుఖ్ పరువుని తీస్తున్నాడు’.. ‘ఆ యాటిట్యూడ్ ఏంటి?.. అతని తండ్రి విజయం సాధించాడు.. అతను కాదు’ అని వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-01T15:20:58+05:30 IST