Shah rukh khan: ఆపరేషన్‌ తర్వాత ఇండియాకు!

ABN , First Publish Date - 2023-07-04T15:59:11+05:30 IST

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు ప్రమాదం జరిగినట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా షారుక్‌ ప్రమాదానికి గురయ్యారని, ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని వార్తలొస్తున్నాయి. వైద్యులు ఆయనకు ఆపరేషన్‌ చేశారని.. షూటింగ్‌కు బై చెప్పి ఇండియాకు వచ్చేశారని సన్నిహితుల నుంచి సమాచారం.

Shah rukh khan: ఆపరేషన్‌ తర్వాత ఇండియాకు!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు (Shah rukh khan)ప్రమాదం జరిగినట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా షారుక్‌ ప్రమాదానికి గురయ్యారని, ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని వార్తలొస్తున్నాయి. వైద్యులు ఆయనకు ఆపరేషన్‌ చేశారని.. షూటింగ్‌కు బై చెప్పి ఇండియాకు వచ్చేశారని సన్నిహితుల నుంచి సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. (Shah rukh khan injured)

ప్రస్తుతం షారుక్‌ అట్లీ (Atlee) దర్శకత్వంలో ‘జవాన్‌’ (Jawan) చిత్రం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా విడుదల కానుంది. నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్‌ ేసతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి కీలక పాత్రధారులు. ఈ చిత్రం దీపికా పడుకోన్‌ అతిథిగా సందడి చేయనున్నారు. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో ‘డుంకీ’ చిత్రంలోనూ షారుక్‌ నటిస్తున్నారు.

Updated Date - 2023-07-04T15:59:11+05:30 IST