Shah Rukh Khan: నటుడి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. షారూఖ్ చేసిన పనికి అభిమానుల ఫిదా..?

ABN , First Publish Date - 2023-03-08T19:12:17+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఆయనకు అభిమానుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనను కలవాలని, ఒక్కసారైనా ఫొటో దిగాలని ఎంతో మంది అభిమానులు తపిస్తుంటారు.

Shah Rukh Khan: నటుడి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. షారూఖ్ చేసిన పనికి అభిమానుల ఫిదా..?

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఆయనకు అభిమానుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనను కలవాలని, ఒక్కసారైనా ఫొటో దిగాలని ఎంతో మంది అభిమానులు తపిస్తుంటారు. అందువల్ల ఫ్యాన్స్ కలను నెరవేర్చడానికి అప్పుడప్పుడు తన నివాసం మన్నత్ (Mannat) కి బయట కింగ్ ఖాన్ దర్శనమిస్తుంటారు. అయితే, కొన్ని రోజుల క్రితం ఇద్దరు అభిమానులు షారూఖ్ ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు. ఫలితంగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు ముంబైలో విలాసవంతమైన భవంతి ఉంది. ‘మన్నత్’ అని దానిని పిలుస్తుంటారు. షారూఖ్‌ను చూడాలని ఇధ్దరు వ్యక్తులు ఆయన ఇంటిలోకి చొరబడ్డారు. తెల్లవారుజామున 3గంటలకు ఆ ఇద్దరు ప్రహరీ గోడను దూకారు. షారూఖ్ మేకప్ రూంలో 11గంటల వరకు ఉన్నారు. దాదాపుగా ఎనిమిది గంటల పాటు అక్కడే గడిపారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులను చూసి కింగ్ ఖాన్ షాక్ అయ్యాడు. అయినప్పటికి అభిమానులపై దయ చూపించాడు. గోడను దూకే సమయంలో వారికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. అందువల్ల షారూఖ్ సిబ్బంది ఆ ఇద్దరికి ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇంట్లోకి అక్రమంగా చొరబడిన వ్యక్తులకు షారూఖ్ ప్రథమ చికిత్సను అందించడంతో అందరు ఫిదా అయ్యారు.

షారూఖ్ ఖాన్ తాజాగా ‘పఠాన్’ (Pathaan) లో నటించాడు. ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో ‘జవాన్’ (Jawan) ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాలో నయనతార, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 2న విడుదల కానుంది.

Updated Date - 2023-03-08T19:12:19+05:30 IST