సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shah Rukh khan: ‘జవాన్‌’ నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ఎంతో తెలుసా?

ABN, First Publish Date - 2023-07-07T16:25:42+05:30

బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘జవాన్‌’ ట్రైలర్‌ను ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమా థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్‌ రైట్స్‌ విషయంలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన జవాన్‌.. తాజాగా మరో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ (Shah rukh Khan) నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జవాన్‌’.(Jawan) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘జవాన్‌’ ట్రైలర్‌ను ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమా థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్‌ రైట్స్‌ విషయంలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన జవాన్‌.. తాజాగా మరో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ట్రైలర్‌ ఇంకా రిలీజ్‌ కాకముందే ఈ సినిమా నాన్‌ థియేట్రికల్‌ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడు కావటం విశేషం.

యాక్షన్‌ ఎలిమెంట్స్‌, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో కూడిన జవాన్‌ ట్రైలర్‌ కోసం ఆడియెన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షారూక్‌ ఖాన్‌ సినిమాల హక్కులన్నీ ఫ్యాన్సీ రేట్లకే అమ్ముడవుతుంటాయి. అయితే తాజాగా ఆయన గత సినిమాల రికార్డులను ఆయన తాజా చిత్రాలని దాటేస్తున్నాయి. పఠాన్‌ బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడు జవాన్‌పై భారీ క్రేజ్‌ క్రియేట్‌ అయ్యింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్‌ హక్కుల కోసం పోటీ పెరిగింది. ఇక నాన్‌ థియేట్రికల్‌ హక్కులు హాట్‌ కేకులా అమ్ముడవటం చూస్తుంటే షారుక్‌ క్రేజ్‌ ఎలా ఉందో తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్టైన్మెంట్‌, గౌరీ ఖాన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-07-07T16:32:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!