#AskSRK: ‘ముందు పఠాన్ చూడు.. తర్వాతే హానీమూన్ చేసుకో’‌‌

ABN , First Publish Date - 2023-01-24T15:38:52+05:30 IST

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan).

#AskSRK: ‘ముందు పఠాన్ చూడు.. తర్వాతే హానీమూన్ చేసుకో’‌‌
Shah Rukh Khan

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ భారీ అంచనాల నడుమ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ తరుణంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా షారుఖ్ ట్విట్టర్‌లో #AskSRK సెషన్‌ని నిర్వహించాడు. ఇందులో భాగంగా.. పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు షారుఖ్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు.

ఇందులో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి షారుఖ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ అభిమాని.. ‘సర్.. గతవారం నాకు పెళ్లి అయ్యింది. ముందు అని హానీమూన్‌కి వెళ్లలా లేక పఠాన్ చూడాలా?’ అని అడిగాడు. దానికి షారుఖ్ స్పందిస్తూ.. ‘బేటా.. పెళ్లి అయ్యి ఓ వారమైన ఇంకా హానీమూన్ కాలేదా!!! అయితే పోయి పఠాన్ చూడు తర్వాత హానీమూన్‌కి వెళ్లు’ అని తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో ‘సూపర్ చెప్పారు సర్’.. ‘సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-01-24T15:38:52+05:30 IST