Sapthami Gowda: క్రేజీ ఆఫర్ కొట్టేసిన ‘కాంతార’ బ్యూటీ

ABN , First Publish Date - 2023-01-15T16:19:38+05:30 IST

రిషబ్ శెట్టి (Rishab Sheety) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara) సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సప్తమి గౌడ (Sapthami Gowda) హీరోయిన్‌గా నటించింది.

Sapthami Gowda: క్రేజీ ఆఫర్ కొట్టేసిన ‘కాంతార’ బ్యూటీ

రిషబ్ శెట్టి (Rishab Sheety) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara) సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సప్తమి గౌడ (Sapthami Gowda) హీరోయిన్‌గా నటించింది. ‘కాంతార’ లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల మన్ననలు దక్కాయి. మూవీ భారీ విజయం సాధించంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా ఈ భామ క్రేజీ ఆఫర్ కొట్టేసింది. స్టార్ డైరెక్టర్ చిత్రంలో ఛాన్స్‌ను దక్కించుకుంది.

‘ది కశ్మీర్ ఫైల్స్‌’ తో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri). తాజాగా ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సప్తమి గౌడ కూడా చేరింది. ఆమె ఈ సినిమాలో నటిస్తుందని వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ‘‘యంగ్, టాలెంటెడ్ నటి సప్తమి గౌడను చిత్రంలోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. భారతదేశంలో ప్రతిభ కలిగిన నటులందరికీ ఓ ప్లాట్‌ఫామ్ ఇవ్వడం మా లక్ష్యం’’ అని వివేక్ అగ్నిహోత్రి తెలిపాడు. ఆమె పాత్ర ఎంతో మంది హృదయాలను తాకుతుందని చెప్పాడు. సంక్రాంతి పండగను సప్తమి ఈ సినిమా సెట్‌లోనే జరుపుకొంది. కోవిడ్‌తో ఇండియా ఏ విధంగా పోరాటం చేసిందనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ విడుదల కానుంది. ఈ సినిమా హిందీ, ఇంగ్లిష్, బంగ్లా, పంజాబీ, భోజ్‌పురి, కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-01-15T16:19:41+05:30 IST