కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sanjay Dutt: డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో గాయం, తలకు రెండు కుట్లు

ABN, First Publish Date - 2023-08-15T11:03:48+05:30

సంజయ్ దత్ తలకి గాయం అయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా షూటింగ్ లో తలకి ఒక కత్తి వచ్చి పొరపాటున తగిలిందని, వెంటనే కట్టు కట్టి, కుట్లు కూడా వేశారని తెలిసింది. అదే రోజు సంజయ్ దత్ షూటింగ్ కూడా చేసారని అన్న వార్త వైరల్ అవుతోంది.

Sanjay Dutt with 'Double iSmart' film director Puri Jagannadh, producer Charmme Kaur and CEO Vishu Reddy

ప్రముఖ హిందీ నటుడు సంజయ్ దత్ (SanjayDutt) తెలుగు సినిమా 'డబుల్ ఇస్మార్ట్' #DoubleiSmart షూటింగ్ లో గాయపడ్డారు అని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అతను ఎప్పుడు గాయపడ్డారు అనే విషయంలో మాత్రం ఎవరూ సరైన వార్తలు రాయటం లేదు. పూరి జగన్నాధ్ (PuriJagannadh) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్' #DoubleiSmart ఇందులో రామ్ పోతినేని (RamPothineni) కథానాయకుడు. ఇది ఇంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' #iSmartShankar అనే సినిమాకి సీక్వెల్ గా తీస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ 'డబుల్ ఇస్మార్ట్' లో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. వారం రోజుల క్రితం జరిగిన ఒక పోరాట సన్నివేశంలో పొరపాటున ఒక కత్తి వచ్చి సంజయ్ దత్ తలకి తగిలింది అని, వెంటనే షూటింగ్ ఆపివేసి అతని దెబ్బకి కట్లు కట్టారని, రెండు కుట్లు కూడా పడ్డాయని వార్తలు వచ్చాయి. (Sanjay Dutt injured while shooting for Double iSmart) అయితే కుట్లు వేసిన తరువాత సంజయ్ దత్ షూటింగ్ కంటిన్యూ చేసారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అతని వలన షూటింగ్ ఆగిపోకూడదు అని, అందుకని తన వర్క్ పూర్తి చేశారు అని చెపుతున్నారు.

సంజయ్ దత్ కి ఇలా దెబ్బలు తగలడం ఏమీ కొత్తకాదు. ఇంతకు ముందు ఒక కన్నడ సినిమా 'కెడి: ది డెవిల్' (KD) అనే సినిమా చేస్తున్నప్పుడు కూడా షూటింగ్ లో సంజయ్ దత్ కి దెబ్బ తగిలింది. సంజయ్ దత్ 'కెజిఫ్ 2' #KGF2 లో విలన్ వెయ్యడం, దానితో అతను మళ్ళీ చాలా సినిమాలు చేస్తూ ఉండటం, ఇప్పుడు దక్షిణాదిలో పెద్ద విలన్ గా సంజయ్ పేరు తెచ్చుకోవడం జరిగింది. విజయ్ (Vijay), లోకేష్ కనగరాజ్ (LokeshKanagaraj) కాంబినేషన్ లో వస్తున్న తమిళ సినిమా 'లియో' #Leo సినిమాలో కూడా సంజయ్ వున్నారు. అలాగే ఇప్పుడు ఈ పూరి జగన్నాధ్, రామ్ పోతినేని సినిమా 'డబుల్ ఇస్మార్ట్' లో, కన్నడ సినిమాలో వున్నారు. ఒక హిందీ సినిమా కూడా చేస్తున్నారు సంజయ్ దత్.

'డబుల్ ఇస్మార్ట్' పోస్ట్ ప్యాక్ అప్ అని కొన్ని ఫోటోలు రెండు రోజుల క్రితమే ఆ సినిమా నిర్మాత, దర్శకులతో సాంఘీక మాధ్యమాల్లో పెట్టారు. నిర్మాత ఛార్మి (CharrmeeKaur), దర్శకుడు పూరి జగన్, కథానాయకుడు రామ్ పోతినేని అందరూ ఆ ఫోటోలను టాగ్ చేసారు కూడా. మరి సంజయ్ దత్ ఎప్పుడు, ఎక్కడ గాయపడ్డారో ఆ యూనిట్ సభ్యులు చెపితే కానీ తెలియదు.

Updated Date - 2023-08-15T11:03:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!