Sanjay Dutt: అది వాస్తవం కాదు: సంజయ్ దత్

ABN , First Publish Date - 2023-04-13T14:29:56+05:30 IST

సంజయ్ దత్ ఒక కన్నడ సినిమా షూటింగ్ పోరాట సన్నివేశం చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడ్డాడు అన్న వార్త నిన్నటి నుండి వైరల్ అయింది. అయితే ఈ వార్తకి సంజయ్ దత్ స్పందిస్తూ ఏమి చెప్పాడో చూడండి

Sanjay Dutt: అది వాస్తవం కాదు: సంజయ్ దత్

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ఒక సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు అన్న వార్తలు నిన్నటి నుండి వైరల్ అవుతూనే వున్నాయి. కన్నడ సినిమా 'కేడి' (KD: The Devil) షూటింగ్ చేస్తుండగా సంజయ్ దత్ గాయపడ్డాడు అని వార్తలు వచ్చాయి. ఈ సినిమా లో యాక్షన్ కింగ్ గా పేరు వున్న అర్జున్ సర్జ (Arjun Sarja) మేనల్లుడు ధృవ్ సర్జ (Dhruv Sarja) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఒక పెద్ద యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది అని వార్తలు వచ్చాయి.

Sanjay-Dutt.jpg

అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, తాను గాయపడలేదని సంజయ్ దత్ సాంఘీక మాంద్యం ద్వారా స్పష్టం చేసాడు. ట్విట్టర్ (Twitter) లో దీని గురించి ఒక పోస్ట్ పెడుతూ, ఇవన్నీ అవాస్తవాలు అని, తాను ఆరోగ్యంగా, శుభ్రంగా వున్నాను అని చెప్పాడు. ప్రస్తుతం 'కేడీ' సినిమా షూటింగ్ చేస్తున్నాను అని, తాను చేసే సన్నివేశాలు అన్నిటికీ ఈ సినిమా యూనిట్ సభ్యులు చాలా ముందు జాగ్రత్తలు తీసుకొని మరీ చేస్తున్నారని అంటూ యూనిట్ వాళ్ళని అభినందిస్తూ పోస్ట్ కూడా పెట్టాడు సంజయ్ దత్. దీనితో అతను ప్రమాదంలో గాయపడ్డాడు అనే వార్తలు అబద్దాలు అని తేలిపోయింది. 'కేడి: ది డెవిల్' (KD: The Devil) దర్శకుడు ప్రేమ్ (Prem) కూడా ఒక సంజయ్ దత్ తో వున్న ఫోటోని ట్విట్టర్ లో పెట్టాడు.

sanjaydutt1.jpg

సంజయ్ దత్ ఈమధ్య దక్షిణాది సినిమాల్లో ఎక్కువగా కనపడుతున్నాడు. 'కెజిఫ్ 2' (KGF 2) సినిమాలో విలన్ గా అందరినీ అలరించాడు, అలాగే ఇప్పుడు ప్రభాస్ (Prabhas), మారుతీ (Maruthi) సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. దక్షిణాది సినిమాల్లో విలన్ గా ఈమధ్య చాలామంది సంజయ్ దత్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. అతను కూడా వీటికే ప్రాధాన్యం ఇస్తున్నాడు కూడా.

Updated Date - 2023-04-13T14:29:57+05:30 IST