Tiger3: ‘టైగర్ 3’ సరికొత్త ప్రోమో.. స‌ల్మాన్ కేక‌

ABN , First Publish Date - 2023-11-03T20:10:08+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టైగర్ 3’. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు రీసెంట్‌గా రిలీజైన ‘లేకే ప్రభు కా నామ్’ సాంగ్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఆడియెన్స్‌కి అనుకోని సర్‌ప్రైజ్‌ని ఇచ్చింది. ‘టైగర్ ఈజ్ బ్యాక్’ పేరుతో 50 సెకన్ల వీడియో ప్రోమోను విడుదల చేసింది.

Tiger3: ‘టైగర్ 3’ సరికొత్త ప్రోమో.. స‌ల్మాన్ కేక‌
salman khan

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan), కత్రినా కైఫ్(Katrina Kaif) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టైగర్ 3’(tiger3). ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు రీసెంట్‌గా రిలీజైన ‘లేకే ప్రభు కా నామ్’ సాంగ్‌తో మూవీపై అంచ‌నాలు మ‌రింత పెంచేశాయి. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్(YRF50) అభిమానుల‌కు అనుకోని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘టైగర్ ఈజ్ బ్యాక్’ పేరుతో 50 సెకన్ల వీడియో ప్రోమోను విడుదల చేసింది. ఈ సినిమాలో టైగర్ పాత్రలో నటిస్తోన్నసల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీలా శత్రువుల నుంచి దేశం నాశనం కాకుండా కాపాడే యోధుడిగా న‌టిస్తున్నాడు.

యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌(YRF Spy Universe)లో భాగంగా ఏక్ థా టైగర్, టైగర్, వార్, పఠాన్ చిత్రాల తర్వాత టైగర్ 3 రిలీజ్ అవుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు టైగర్ 3 రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి వస్తోన్న 5వ స్పై ఇంటర్ కనెక్ట్ ఫ్రాంచైజీ ఇది.


తాజాగా విడుదలైన టైగర్ ఈజ్ బ్యాక్ ప్రోమోను గమనిస్తే.. చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) భారతదేశాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తాడు. దానికి టైగర్ ఎలా స్పందించాడు.. విలన్‌కి ఎలా బ‌దులిచ్చాడనే విషయాన్ని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రోమోలో చూపించారు.

మనీష్ శర్మ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్(Salman Khan), జోయా పాత్రలో కత్రినా కైఫ్(Katrina Kaif) నటించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుద‌ల చేస్తున్నారు.

Updated Date - 2023-11-03T20:12:16+05:30 IST