Tiger3: 300 కోట్ల క్ల‌బ్‌లోకి..

ABN , First Publish Date - 2023-11-17T19:19:49+05:30 IST

బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్‌ఖాన్, క‌త్రినాఖైప్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన‌ టైగ‌ర్‌3 ఈ దీపావ‌ళికి ప్ర‌పంచ వ్యాప్తంగా 8900 థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు టైగ‌ర్‌3 భార‌త‌దేశంలో రూ.200 కోట్లు, రెస్టాప్ ఇండియాలో రూ.100 కోట్ల వ‌ర‌కు వ‌సూల్లు చేసి రూ.300 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

Tiger3: 300 కోట్ల క్ల‌బ్‌లోకి..
tiger3

బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్‌ఖాన్( Salman Khan), క‌త్రినాఖైప్ (Katrina Kaif) క‌ల‌యిక‌లో వ‌చ్చిన‌ టైగ‌ర్‌3 (Tiger3) ఈ దీపావ‌ళికి ప్ర‌పంచ వ్యాప్తంగా 8900 థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న‌ది. ఇప్ప‌టికే మొద‌టి రోజు 49.50 కోట్లు రాబ‌ట్టిన తొలి చిత్రంగా రికార్డుల‌కెక్కిన ఈ సినిమా, రెండో రోజూ రూ.59.50 కోట్లు రాబ‌ట్టి ప‌ఠాన్ సాధించిన రూ.68 కోట్ల త‌ర్వాతి స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత రెండు, మూడు రోజులు స్ట‌డీగా సాగిన క‌లెక్ష‌న్లు త‌ర్వాత కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా ఐదో రోజు వ‌చ్చేస‌రికి దేశంలో మొత్తం వ‌సూళ్లు రూ.187.65 కోట్లకు చేరింది.

ఇక ఆరో రోజు శుక్ర‌వారానికి దాదాపు దేశ‌వ్యాప్తంగా రూ.20 కోట్లు క‌లెక్ట్ చేసి 200 మార్క్ దాట‌గా, ఈ వీకెండ్ క‌లిసొచ్చి భారీగా కలెక్ష‌న్లు కొల్ల‌గొట్టే మంచి అవ‌కాశం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు టైగ‌ర్‌3 భార‌త‌దేశంలో రూ.200 కోట్లు వసూలు చేయగా.. గ్లోబల్‌గా ఈ సినిమా రూ.300 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. స‌ల్మాన్ చ‌రిత్ర‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగానే కాగా మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన మూడో చిత్రంగా టైగ‌ర్‌3 రికార్డుల‌కెక్కింది. అదేవిధంగా 300 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన 9వ చిత్రంగా స‌ల్మాన్ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు.


య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ సినిమాటిక్ యూనివ‌ర్స్ (YRF Spy Universe)లో భాగంగా వ‌చ్చిన ఈ టైగ‌ర్‌3 ముందు భాగాలు ఎక్‌థా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై చిత్రాలు గ‌తంలో మంచి విజ‌యాలు సాధించి రూ.500 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టాయి. ఈ YRF స్పై యూనివ‌ర్స్‌లో వార్‌, ప‌ఠాన్ కూడా ఓ భాగం కాగా ప్ర‌స్తుతం వార్‌2 షూటింగ్ ద‌శ‌లో ఉన్న‌ది. ప‌ఠాన్ చిత్రంలో స‌ల్మాన్ ఖాన్‌, టైగ‌ర్3లో షారుఖ్‌ ఖాన్‌లు గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌గా ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో అల‌రించాయి. వార్ 2 సినిమాలో హృతిక్ రోష‌న్‌, జూ.ఎన్టీఆర్ న‌టిస్తున్నారు.

టైగ‌ర్‌3 సాధించిన వ‌సూళ్లు .. డే వైస్‌

Day 1 మొద‌టి ఆదివారం Rs 44.5 Cr

Day 2 సోమ‌వారం Rs 59.25 Cr

Day 3 మంగ‌ళ‌వారం Rs 44.3 Cr

Day 4 బుధ‌వారం Rs 21.1 Cr

Day 5 గురువారం Rs 18.5 Cr

Day 6 శుక్ర‌వారం Rs 15 20 Cr

Updated Date - 2023-11-17T20:18:25+05:30 IST