Salman Khan: 'టైగర్ 3' విడుదల తేదీ ఫిక్స్ అయింది, ఎప్పుడంటే...

ABN , First Publish Date - 2023-10-13T16:24:30+05:30 IST

ఏ సినిమా అయినా శుక్రవారం విడుదల చేస్తారు, లేదా ఒకటి రెండు రోజులు ముందు చేస్తారు ఏదైనా సెలవులు కలిసి వస్తే. కానీ సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మాత్రం విడుదల తేదీ, అలాగే అభిమానుల కోసం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించేలా వున్నాయి.

Salman Khan: 'టైగర్ 3' విడుదల తేదీ ఫిక్స్ అయింది, ఎప్పుడంటే...
Salman Khan

సల్మాన్ ఖాన్ (SalmanKhan), కత్రినా కైఫ్ (KatrinaKaif), ఇమ్రాన్ హష్మి (EmraanHashmi) నటించిన 'టైగర్ 3' $Tiger3 సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. ఆమధ్య విడుదలైన సినిమా టీజర్ బాగా వైరల్ అయింది, సినిమా మీద ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ట్రైలర్ ఈనెల అంటే అక్టోబర్ 16న (October16) విడుదల చేస్తున్నామని చిత్ర నిర్వాహకులు ఒక ప్రకటనలో చెప్పారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఇంకా ఖరారు చెయ్యలేదు అని తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం, సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' సినిమా విడుదల తేదీ నవంబర్ 12న దీపావళి (Deepavali) రోజు విడుదల చెయ్యాలని భావిస్తున్నట్టుగా హిందీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం విడుదలకి చాలా పెద్ద సినిమాలు వున్నాయి. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3', తరువాత రణబీర్ కపూర్ (RanbirKapoor) నటిస్తున్న 'యానిమల్' #Animal, తరువాత ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'సలార్' #Salaar సినిమాలు వరసగా విడుదలకి వున్నాయి. అలాగే షారుఖ్ (ShahRukhKhan) నటించిన 'డంకి' #Dunki కూడా డిసెంబర్ లో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు.

salmankhan-tiger31.jpg

మామూలుగా అయితే ఏ సినిమా అయినా శుక్రవారం విడుదల చేస్తారు, సెలవులు కలిసి వస్తే ఒకటి రెండు రోజులు ముందుగా విడుదల చేస్తారు, కానీ ఆదివారం విడుదల చెయ్యడం అనేది చాలా తక్కువ. ఈమధ్య కాలంలో ఒక పెద్ద సినిమా ఆదివారం విడుదలవ్వలేదు, కానీ సల్మాన్ ఖాన్ తన 'టైగర్ 3' సినిమాని నవంబర్ 12 అంటే ఆదివారం నాడు విడుదల చెయ్యాలని సంకల్పించినట్టుగా తెలిసింది. ఎందుకంటే అదేరోజు దీపావళి పండగ రోజు కూడా. అందుకే అభిమానులకి దీపావళి కానుకగా ఈ 'టైగర్ 3' ని ఆరోజు విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టుగా బాలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయి. అయితే అక్టోబర్ 16 ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం వుంది అని అంటున్నారు.

'టైగర్ 3' కి మనీష్ శర్మ (ManishSharma) దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో షా రుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని కూడా అంటున్నారు. పఠాన్ గా షా రుఖ్ కనపడతాడని అంటున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ (YashRajFilms) ఈ సినిమాకి నిర్మాతలు.

Updated Date - 2023-10-13T16:30:53+05:30 IST