Salman Khan: 'టైగర్ 3' రెండు రోజుల్లో వందకోట్లు, షాకింగ్

ABN , First Publish Date - 2023-11-15T12:59:37+05:30 IST

సల్మాన్ ఖాన్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చాటాడు. దీపావళి పండగ నాడు విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లో వందకోట్లు కలెక్టు చేసి రికార్డు సృష్టించింది.

Salman Khan: 'టైగర్ 3' రెండు రోజుల్లో వందకోట్లు, షాకింగ్
A still from Tiger 3

సల్మాన్ ఖాన్ (SalmanKhan), కత్రినా కైఫ్ (KatrinaKaif) జంటగా 'టైగర్ 3' #Tiger3 సినిమా దీపావళి పండగ సందర్భంగా ఆదివారం విడుదలైంది. ఈ సినిమాకి కొంచెం మిశ్రమ టాక్ వచ్చినా, సల్మాన్ ఖాన్ తన సత్తా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించాడు. ఈ సినిమా గూఢచారి నేపథ్యంలో వచ్చిన మూడో సీక్వెల్. ఆదిత్య చోప్రా (AdityaChopra) నిర్మాత, మనీష్ శర్మ (ManeeshSharma) దర్శకుడు. ఇందులో షా రుఖ్ ఖాన్ (ShahRukhKhan) ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తాడు. చివర్లో హ్రితిక్ రోషన్ (HritikRoshan) కూడా కనిపిస్తాడు.

ఈ సినిమా దీపావళి రోజున విడుదలై మొదటి రోజు ఆల్ టైమ్ చరిత్ర సృష్టించింది. అలాగే సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చి పెట్టింది. మొదటి రోజు హిందీ లో ఈ సినిమా రూ. 43 కోట్లు కలెక్టు చేసింది, అలాగే డ‌బ్బింగ్ వెర్ష‌న్ అంటే తెలుగు, తమిళం కలిపి రూ. 1.50 కోట్లు కలెక్టు చేసింది. మొత్తం ఈ సినిమా రూ. 44.50 కోట్లు వసూల్ చేసి చరిత్ర సృష్టించింది.

salmankhan-tiger31.jpg

మొదటి రోజున ‘టైగర్ 3’ సాధించిన రికార్డులు: హిందీ సినిమా చరిత్ర‌లోనే దీపావ‌ళి పండగ రోజున అత్య‌ధిక గ్రాస్ క‌లెక్ష‌న్స్ సాధించింది. అలాగే స‌ల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే అత్య‌ధిక ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రం కూడా ఈ 'టైగర్ 3' అవటం విశేషం. ఈ టైగ‌ర్ ఫ్రాంచైజీల్లో అత్య‌ధిక ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమా కూడా ఇదే అవటం ఆసక్తికరం. ఇంత‌కు ముందున్న దీపావ‌ళి రికార్డుల‌ను మూడురెట్లు అధికంగా వ‌సూళ్ల‌ను సాధించిన 'టైగ‌ర్ 3'. (Tiger 3 collected Rs 100 crores in just two days)

ఇక రెండో రోజు కూడా సల్మాన్ ఖాన్ తన ప్రభంజనం చూపాడు. రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ వందకోట్లు సాధించింది. ఇలా రెండు రోజుల్లో వందకోట్లు సాధించిన ఘనత సాధించిన మూడో సినిమా ఈ 'టైగర్ 3'. ఇంతకు ముందు 'పఠాన్' #Pathaan, 'జవాన్' #Jawan ఇప్పుడు 'టైగర్ 3' ఈ ఘనత సాధించాయి. సోమవారం ఈ సినిమా రూ.58 కోట్లు కలెక్టు చేసింది. రెండు రోజులకి గాను హిందీలో కేవలం రూ.101 కోట్లు కలెక్టు చేసింది. ఇక తెలుగు, తమిళంలో ఈ సినిమా రెండో రోజు రూ.1.25 కోట్లు కలెక్టు చేసింది.

Updated Date - 2023-11-15T12:59:38+05:30 IST