Salman khan: దుస్తులతో ఎంత సంరక్షిస్తే అంత మంచిది!

ABN , First Publish Date - 2023-05-02T11:04:03+05:30 IST

మహిళల శరీరం, వస్త్రాధారణ గురించి బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Salman khan: దుస్తులతో ఎంత సంరక్షిస్తే అంత మంచిది!

మహిళల శరీరం, వస్త్రాధారణ గురించి బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పని చేసే సెట్‌లో మహిళ వస్త్రాధారణ విషయంలో ఆయన కొన్ని నియమాలు పెట్ట్టిన సంగతి తెలిసిందే. ‘తన షూటింగ్‌ సెట్‌లో మహిళల (Comments on Womens dressing) వస్త్రాధారణ కరెక్ట్‌గా ఉండాలని, వీ నెక్‌ దుస్తులు ధరించరాదని సల్మాన్‌ నియమం పెట్టారు. దానిపై ఇటీవల టెలికాస్ట్‌ అయిన ‘ఆప్‌ కీ అదాలత్‌’ (aap ki adalat) టీవీ షోలో వ్యాఖ్యాత రజత్‌ శర్మ సల్మాన్‌ను ఈ విషయంపై ప్రశ్నించారు. ‘‘మీ సినిమా సెట్‌లో మహిళల దుస్తుల విషయంలో నియమం పెట్టే మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటించడం ఏ లెక్కన చూడాలి’ అని అడిగారు. దీనిపై సల్మాన్‌ స్పందిస్తూ.. ‘‘ఇందులో ద్వంద్వ ప్రమాణాలు లేవు. అది షూటింగ్‌ జరుగుతున్నప్పుడు మాత్రమే! నా దృష్టిలో మహిళల శరీరం చాలా విలువైనది. దానిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే అంత మంచిది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు. మన తల్లి, భార్య, అక్కా చెల్లెళ్లులాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్న మాట. మహిళలు అవమానానికి గురి కాకూడదని నేను కోరుకుంటాను’’ అని అన్నారు.

ఇదే విషయంపై సల్మాన్‌తో కలిసి ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’లో నటించిన నటి పాలక్‌ తివారీ (Palak tiwari) కూడా మాట్లాడారు. ‘సల్మాన్‌ తన సినిమా సెట్లో మహిళలందరూ సంప్రదాయంగా ఉండాలని కోరుకుంటారు. వి నెక్‌తో కాకుండా మెడ వరకూ నిండుగా ఉండేలా ఆయన చూస్తారు’ అని చెప్పిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-05-02T11:04:03+05:30 IST