Dunki Vs Salaar : మల్టీప్లెక్స్‌ చైన్స్‌కు సలార్‌ షాక్‌!

ABN , Publish Date - Dec 21 , 2023 | 01:08 PM

నేషనల్‌ మల్టీప్లెక్స్‌ చైన్స్‌ పీవీఆర్‌, ఐనాక్స్‌కు ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ టీమ్‌ నుంచి భారీ షాక్‌ తగిలింది. ఉత్తరాదిలో షారుక్‌ఖాన్ నటించిన ‘డంకీ’ చిత్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో దక్షిణాది విషయంలో ఝలక్‌ ఇచ్చారు.

Dunki Vs Salaar : మల్టీప్లెక్స్‌ చైన్స్‌కు సలార్‌ షాక్‌!

నేషనల్‌ మల్టీప్లెక్స్‌ చైన్స్‌ (Multiplex Chain) పీవీఆర్‌, ఐనాక్స్‌కు ప్రభాస్‌ (Prabhas) నటించిన ‘సలార్‌’ (Salaar) టీమ్‌ నుంచి భారీ షాక్‌ తగిలింది. ఉత్తరాదిలో షారుక్‌ఖాన్ నటించిన ‘డంకీ’ చిత్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో దక్షిణాది విషయంలో ఝలక్‌ ఇచ్చారు. నార్త్‌లో ‘సలార్‌’కు అన్యాయం చేయాలని చూస్తే సౌత్‌ ఇండియాలో సినిమాను ఇచ్చేది లేదని ప్రభాస్‌ దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కొట్టినట్లు చెప్పడంతో పీవీఆర్‌, ఐనాక్స్‌ యాజమాన్యానికి గట్టి షాక్‌ తగిలింది, అసలు విషయంలోకి వెళ్తే..

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్  నీల్‌ దర్శకత్వంలో వహించిన 'సలార్‌’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుక్‌ఖాన్ నటించిన డంకీ దాని కంటే ఒక్క రోజు ముందు గురువారం విడుదలైంది. నార్త్‌ ఇండియాలో ఆ సినిమాకు పీవీఆర్‌, ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ సంస్థలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అధిక సంఖ్యలో థియేటర్లు ఏర్పాటు చేశాయి. ప్రభాస్‌ కంటే షారుక్‌ఖాన్ కు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. దాంతో ప్రభాస్‌ నిర్మాతలు వాళ్లకు షాక్‌ ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ, తెలంగాణ రాషా్ట్రల్లో ‘సలార్‌’ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. అయితే... బుక్‌ మై షో, పేటీఎం వంటి టికెట్‌ బుకింగ్‌ యాప్స్‌ ఓపెన్‌ చేిసి చూస్తే! పీవీఆర్‌, ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లో బుకింగ్‌ ఓపెన్‌ కాలేదు. ఎందుకంటే... ఉత్తరాది రాష్ట్రాల్లో తమ సినిమాకు తక్కువ ఇస్తామని చెప్పినందుకు, దక్షిణాది రాష్ర్టాల్లో కూడా వాళ్ళకు సినిమా ఇవ్వడం మానేశారు. పీవీఆర్‌, ఐనాక్స్‌ యాజమాన్యానికి వాళ్ళ స్క్రీన్స్ లో సినిమా విడుదల చేయమని చెప్పేశారు. (salaar vs Dunki)

ఉత్తరాదిలో ప్రభాస్‌ కంటే షారుఖ్‌ ఖాన్‌, దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీకి అభిమానులు ఎక్కువ. అయితే... అక్కడ ప్రభాస్‌ను కూడా విపరీతంగా ఇష్టపడేవాళ్లు ఉన్నారు. అందుకు ఉదాహరణ సాహో చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీలోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాదిలో ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, దక్షిణాదిలో షారుక్‌ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీకు ఉన్నారా? అంటే ప్రశ్నార్థకమే. యాక్షన్‌ ఫిలిమ్స్‌ కావడంతో ‘పఠాన్‌’, ‘జవాన్‌’ మన దగ్గర చూశారు. రాజ్‌ కుమార్‌ హిరాణీ హ్యూమర్‌ మాస్‌ జనాలు చూసింది తక్కువ. నార్త్‌ ఇండియాలో వాళ్ళ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూసి అక్కడ ప్రయారిటీ ఇవ్వాలని భావించిన పీవీఆర్‌, ఐనాక్స్‌ యాజమాన్యం సౌత్‌ ఇండియాలో పెద్ద మార్కెట్‌ మిస్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సలార్‌లో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఉన్నారు. కేరళలో ‘బాహుబలి 2’ రికార్డులను ఈ సినిమా బ్రేక్‌ చేేస అవకాశాలున్నాయని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ‘కెజియఫ్‌’తో ఇండియాలో స్టార్‌ దర్శకుడిగా ప్రశాంత్‌ నీల్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో ఆయన నంబర్‌ వన్‌ దర్శకుడు. తెలుగులో ప్రభాస్‌ మార్కెట్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. దక్షిణాదిలో ‘సలార్‌’కు పోటీ లేదు. ఆ సినిమా ఏ థియేటర్లలో ఉంటే ఆ థియేటర్లకు ప్రేక్షకులు వెళ్తారు. దీంతో పీవీఆర్‌, ఐనాక్స్‌, మిరాజ్‌ మల్టీప్లెక్స్‌ చైన్‌కు లాసు తప్పదు. ఇదంతా తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు డంకీ చిత్రం గురించి ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. అక్కడ షార్‌క్‌ అయితే... ఇక్కడ ప్రభాస్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Dec 21 , 2023 | 01:41 PM