Weekend Box office report: వందేళ్ల భారతదేశ సినిమా చరిత్రలో రికార్డు కలెక్షన్స్, ఎప్పుడు, ఎలా అంటే...

ABN , First Publish Date - 2023-08-14T14:18:44+05:30 IST

వందేళ్ళకి పైగా వున్న భారతదేశ సినిమా చరిత్రలో గత వారం ఒక రికార్డు సృష్టించింది. సినిమా థియేటర్స్ కి ప్రేక్షకులు రావటం లేదు అనుకున్న సమయంలో ఇలాంటి రికార్డు భారతీయ చిత్ర పరిశ్రమకి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే...

Weekend Box office report: వందేళ్ల భారతదేశ సినిమా చరిత్రలో రికార్డు కలెక్షన్స్, ఎప్పుడు, ఎలా అంటే...
Rajinikanth, Akshay Kumar and Sunny Deol

భారతదేశ వందేళ్ల సినిమా చరిత్రలో (100 years of Indian cinema) రికార్డు సృష్టించిన వారాంతపు కలెక్షన్స్. అది ఎప్పుడో కాదు, గత వారం విడుదలైన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన సునామీ కలెక్షన్స్. ఇదేదో వూరికే అంటున్న మాటలు కాదు, అక్షరాలా అధికారికంగా ఇచ్చినవి, ఈ కలెక్షన్ల వరద చూస్తుంటే ఇంతలా ఇంతకు మునుపెన్నడూ ఇటువంటి కలెక్షన్ లేవని ప్రొడ్యూసర్స్ గిల్డ్, మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (Producers' Guild) వాళ్ళు అధికారికంగా (Multiplex Association of India) ప్రకటించారు.

jailermovie1.jpg

గత వారం కలెక్షన్స్ అంటే ఆగస్టు 11 నుండి 13 వరకు, అంటే శుక్రవారం నుండి ఆదివారం వరకు విడుదలైన సినిమాలు, వాటి వసూళ్లు వివరాలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. రజినీకాంత్ (Rajinikanth) నటించిన 'జైలర్' #Jailer, అక్షయ్ కుమార్ (AkshayKumar) నటించిన 'ఓఎంజి 2' #OhMyGod2, సన్నీ డియోల్ (SunnyDeol) సినిమా 'గదర్ 2' (Gadar2), చిరంజీవి (Chiranjeevi) నటించిన 'భోళాశంకర్' #BholaaShankar, ఇలా అన్ని సినిమాల కలెక్షన్స్ కాన చూసుకుంటే మొత్తం రూ. 390 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేశాయని, ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక రికార్డు అని చెపుతున్నారు.

recordcollections.jpg

ఆమధ్య కోవిడ్ వచ్చిన తరువాత సినిమా థియేటర్స్ కి ప్రేక్షకులు రావటం మానేశారు. ఓటిటి లో సినిమాలు చూసుకోవడం మొదలెట్టారు, ఎంత పెద్ద, చిన్న సినిమా అయినా థియేటర్స్ వెల వెల బోయేవి. "అయితే గతవారం మాత్రం వీటన్నిటికీ విరుద్ధంగా ప్రేక్షకులు విపరీతగా థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూసారు. ఉదయం తెల్లవారుజామున వేసిన షోస్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయి అంటే, ప్రేక్షకులు మళ్ళీ సినిమాలు చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు అని అర్థం అవుతోంది. ఇది సినిమా పరిశ్రమకి ఒక కొత్త శక్తిని ఇవ్వటమే కాకుండా, మరికొన్ని సినిమాలు తీసి విడుదల చెయ్యాలి అన్న ఉత్సాహం అందరిలో నింపుతుంది," అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సుభాషిష్ సర్కార్ అన్నారు.

omg2.jpg

ఇది నిజంగా ఒక శుభపరిణామమే అని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేనటువంటి కలెక్షన్స్ వచ్చాయి అంటే సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరి శ్రమ దీని వెనక చాలా ఉందనే చెప్పాలి. రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమా అన్ని భాషల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరగదీస్తోంది అనే చెప్పాలి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా సుమారు రూ.19 కోట్ల షేర్ వరకు కలెక్టు చేసి తెలుగు హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాల పంట పండిస్తోంది. నాలుగు రోజుల్లో ప్రపంచం మొత్తం మీద ఈ సినిమా సుమారు రూ. 344 కోట్ల గ్రాస్ కలెక్టు చేసి ఇంకా చాలా స్ట్రాంగ్ గా వెళుతోంది. రజినీకాంత్ సినిమా చాలా సంవత్సరాల తరువాత ఇలా ఒక పెద్ద హిట్ గా నిలవడటం ఇదే మొదటిసారి.

చిరంజీవి నటించిన 'భోళాశంకర్' సినిమా మూడు రోజులకు గాను రూ 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, అంటే సుమారు రూ.25 కోట్ల షేర్ అని, ఈ సినిమా ఒక పెద్ద ఫ్లాప్ అని చెపుతున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. ఈ సినిమా సోమవారం నుండి థియేటర్ ఆక్యుపెన్సీ కూడా చాలా తక్కువగా వుంది కాబట్టి, ఈ సినిమాకి ఇక కలెక్షన్స్ రావని చెపుతున్నారు.

gadar2.jpg

హిందీలో విడుదలైన అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్ 2' సినిమా పాజిటివ్ రిపోర్ట్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగున్నాయని, చాలా కాలం తరువాత అక్షయ కుమార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతోంది అనలిస్ట్స్ అంటున్నారు. అలాగే సన్నీ డియోల్, అమీషా పటేల్ (AmeeshaPatel) నటించిన 'గదర్ 2' కూడా పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ రెండు హిందీ సినిమాలు సీక్వెల్ కావటం ఆసక్తికరం. ఏమైనా గతవారం విడుదలైన సినిమాలన్నీ ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సృష్టించటం పరిశ్రమకి, నిర్మాతలకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనటంలో ఎట్టి సందేహం లేదు.

Updated Date - 2023-08-14T14:18:44+05:30 IST