సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sushmita Sen: గుండెపోటుకు కారణం చెప్పిన విశ్వసుందరి

ABN, First Publish Date - 2023-03-05T13:48:58+05:30

మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే! గుండెలోన ముఖ్యమైన రక్తనాళం మూసుకుపోయిందని సకాలంలో ఆస్పత్రికి వెళ్లడం సకాలంలో వైద్యం అందడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ (Sushmita Sen) ఇటీవల గుండెపోటుకు (sushmita sen got heart attack) గురైన సంగతి తెలిసిందే! గుండెలోన ముఖ్యమైన రక్తనాళం మూసుకుపోయిందని సకాలంలో ఆస్పత్రికి వెళ్లడం సకాలంలో వైద్యం అందడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. తాజాగా ఆమె మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో షేర్‌ చేశారు. ఈ సమయంలో తనపై ప్రేమ చూపించి, దేవుణ్ణి ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆమె గొంతు ఇన్‌ఫెక్షన్‌తో మాట్లాడలేని స్థితిలో ఉన్నా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. (sushmita sen hospitalized)

‘‘నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ప్రపంచ నలుమూలల నుంచి ప్రేమాభిమానాలు చూపించారు. నేను త్వరలో కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. మీ ఆశీసులతోనే నేను ఆరోగ్యంగా ఉన్నా. కాకపోతే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మాట్లాడటానికి గొంతు సహకరించడం లేదు. నా గొంతు విని అనారోగ్యంగా ఉన్నానని అనుకోకండి. నేను చాలా హెల్దీగా ఉన్నా. కొంతకాలంగా నన్ను ఎంతోమంది రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. దీనితో కాస్త ఒత్తిడికి గురయ్యాను. ఆ క్రమంలోనే తీవ్ర గుండెపోటు వచ్చింది. ప్రధాన రక్తనాళం 95 శాతం (heart valve 95% closed) మూసుకుపోయింది. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. అక్కడి వైద్యులు, ఇతర సిబ్బంది ఎంతగానో కృషి చేసి నన్ను ప్రమాదం నుంచి గట్టెక్కించారు. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఈ విషయం తెలుసు. చికిత్స పొందుతున్న సమయంలో ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పాలనుకోలేదు. చికిత్స పూర్తై.. కోలుకున్న తర్వాతే సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టాను. దానికి వేలల్లో అభిమానులు స్పందించి ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ పోస్టులు పెట్టారు. నాపై ప్రేమను చూపించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. త్వరలోనే ‘ఆర్య-3’ షూటింగ్‌లో పాల్గొంటా. ఎప్పటిలానే మిమ్మల్ని అలరిస్తా’’ అని చెప్పుకొచ్చారు. (Sushmita sen Recoverd)

కొందరికి నా విన్నపం ఒకటే... వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టకండి. ప్రతి ఒక్కరికిపై ప్రేమను చూపించండి’’ అని చెప్పారు సుస్మితా(Miss Universe 1994).

Updated Date - 2023-03-05T14:51:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!