కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ranbir Kapoor: రణ్‌బీర్‌కు.. రష్మిక తెలుగు, కన్నడ పాఠాలు

ABN, First Publish Date - 2023-11-22T21:19:37+05:30

రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యానిమల్’. అర్జున్ రెడ్డితో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రత్యేక ప్రమోషన్స్ నిర్వహిస్తూ తమ సినిమాను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

rashmika, ranbir

రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం యానిమల్ (Animal). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రా అండ్ రస్టిక్, ఎమోషనల్ కథాంశంతో ఔట్ అండ్ ఔట్ ఫుల్ యాక్షన్ తో వస్తున్న ఈ చిత్రంలో నేనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తుండగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

ఈక్రమంలో ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్ సినిమాను మోస్ట్ ఎవైటెడ్ మూవీగా మార్చడమే కాక సినిమా విడుదల కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది. ఇక ఇదే సమయంలో సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇటీవలే దుబాయ్ లోనూ ప్రత్యేక ప్రమోషన్ నిర్వహించి ఇప్పుడు దేశ మొత్తం తిరుగుతూ అయా రాష్ట్రాలలో ఫేమస్ టీవీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తెలుగులోనూ బాలకృష్ణ హోష్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్3లో పాల్గొని తమ సినిమాను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.


తాజాగా దేశం మొత్తం బాగా ఫేమస్ అయిన ‘ఇండియన్ ఐడల్’ కార్యక్రమానికి రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక గెస్ట్ గా హజరయ్యారు. అయితే వారు స్టూడియోలోకి వెళుతున్న సమయంలో అక్కడే ఉన్న జర్నలిస్టు రణబీర్ ను తెలుగులో మాట్లాడండి అడగ్గా అందరికీ నమస్కారం అంటూ ముగించగా రష్మిక (Rashmika Mandanna) మధ్యలో కలుగ జేసుకుని మీరు బాగున్నారా,నేను బాగున్నాను అని కూడా చెప్పండి అంటూ తెలుగులో, కన్నడలో నేర్పించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మీరూ ఓ సారి లుక్కేయండి.

Updated Date - 2023-11-22T21:25:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!