Brahmastra 2: ‘బ్ర‌హ్మాస్త్ర2’లో ఆ త‌ప్పులు ఉండ‌వు

ABN , First Publish Date - 2023-10-25T13:02:31+05:30 IST

బ్ర‌హ్మాస్త్ర పార్ట్‌1 శివ సినిమాలో చేసిన త‌ప్పులు పార్ట్‌2లో చేయ‌మ‌ని మ‌రింత ప‌కడ్భందీ స్క్రిప్ట్‌తో, మంచి డైలాగ్స్‌తో మొద‌టి భాగానికి ప‌దింత‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో సినిమా ఉండ‌బోతున్న‌దని హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మ‌స్త సినిమా విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు.

Brahmastra 2: ‘బ్ర‌హ్మాస్త్ర2’లో ఆ త‌ప్పులు ఉండ‌వు
Ranabir Kapoor

‘బ్ర‌హ్మాస్త్ర పార్ట్‌1 శివ’ సినిమాలో చేసిన త‌ప్పులు పార్ట్‌2లో చేయ‌మ‌ని మ‌రింత ప‌కడ్భందీ స్క్రిప్ట్‌తో , మంచి డైలాగ్స్‌తో మొద‌టి భాగానికి ప‌దింత‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో సినిమా ఉండ‌బోతున్న‌దని హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మ‌స్త సినిమా విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు. పార్ట్1 లో శివ‌, ఇషాల మ‌ధ్య ప్రేమ‌ స‌న్నివేశాలు, సినిమా డైలాగ్స్ విష‌మంలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని, రాబోయే పార్ట్‌2లో అలాంటి త‌ప్పులు జ‌రుగ‌కుండా చూసుకుంటామ‌ని అన్నారు. అయాన్ ముఖ‌ర్జీ ప్ర‌స్తుతం హృతిక్‌, జూ.ఎన్టీఆర్‌ల‌తో చేస్తున్న ‘వార్‌2’ సినిమా బిజీలో ఉన్నాడ‌ని, ఆ చిత్రం షూటింగ్ 2024లో ముగుస్తుంద‌ని.. అది పూర్తవ‌గానే 2025లో బ్ర‌హ్మాస్త్ర 2 షూటింగ్ ప్రారంభిస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే సినిమాకు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయ‌ని, స్క్రిప్ట్ రెడీగా ఉంద‌ని చెప్పుకొచ్చారు.

బాలీవుడ్‌లోనే అత్యంత‌ భారీ బ‌డ్జెట్‌తో ఐదు సంవ‌త్స‌రాల పాటు షూటింగ్ చేసుకున్న చిత్రంగా బ్ర‌హ్మాస్త్రకి పేరుంది. క‌రోనాకు రెండు సంవ‌త్స‌రాల ముందు ప్రారంభ‌మైన ఈ చిత్రం 2022 సెప్టెంబ‌ర్‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఇందులోని పాట‌లు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ‌బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ హీరోహీరోయిన్లుగా వ‌చ్చిన ఈ చిత్రంలో అమితాబ‌చ్చ‌న్‌, షారుఖ్‌ఖాన్‌, నాగార్జున వంటి సీనియ‌ర్ న‌టులు కీల‌క పాత్ర‌లు పోషించారు.


ముఖ్యంగా తెలుగు వెర్ష‌న్‌ను అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కుడిగా ఉంటూనే చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను త‌న భుజ‌స్కందాల‌పై వేసుకుని మ‌రి ప్ర‌జ‌ల్లోకి చేరేలా చూశారు. ఈ సినిమాకు ప్రీతం అందించిన పాట‌లు కూడా తోడ‌వ‌డంతో ప్ర‌జాద‌ర‌ణ పొందింది. పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పార్ట్ 1కే 5 సంవ‌త్స‌రాలు తీసుకున్న ద‌ర్శ‌కుడు పార్ట్ 2కు ఎన్ని సంవ‌త్స‌రాలు తీసుకుంటాడో అని అభిమానులు నిరుత్సాహ ప‌డుతున్నారు. సినిమాలో గ్రాఫిక్స్‌, త‌దిత‌ర స‌న్నివేశాల‌ను కాఫీ కొట్టారనే టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. రూ400 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 432 కోట్లు రాబ‌ట్టింది.

Updated Date - 2023-10-25T13:44:17+05:30 IST