Ranbir-Rashmika: వీళ్ళ రొమాన్స్ వేరే లెవెల్లో వుందిగా, అర్జున్ రెడ్డికి పదింతలు రెట్టింపు..

ABN , First Publish Date - 2023-10-11T13:06:26+05:30 IST

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా వస్తున్న హిందీ సినిమా 'యానిమల్' నుంచి ఒక పాట విడుదలైంది. ఈ పాట చూసాక ఇందులో దర్శకుడు సందీప్ వంగా అన్ని మసాలాలు బాగా దట్టించినట్టుగా కనపడుతోంది. టీజర్ లో వైలెన్సు, పాటలో రొమాన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.

Ranbir-Rashmika: వీళ్ళ రొమాన్స్ వేరే లెవెల్లో వుందిగా, అర్జున్ రెడ్డికి పదింతలు రెట్టింపు..
Rashmika Mandanna and Ranbir Kapoor from the film Animal

బాలీవుడ్ లోనే కాదు, చాలామంది సినిమా ప్రేక్షకుల కళ్ళు అన్నీ ఈ 'యానిమల్' #Animal అనే సినిమా మీదే వున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్ (RanbirKapoor) కథానాయకుడు అయితే, ఇందులో నేషనల్ క్రష్ (NationalCrush) అని పేరు పొందిన రష్మిక మందన్న (RashmikaMandanna) కథానాయిక. ఇవన్నీ కాకుండా దీనికి 'అర్జున్ రెడ్డి' #ArjunReddy, 'కబీర్ సింగ్' #KabirSingh ఫెమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga). ఈ సినిమా టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది, అది వైరల్ అయింది కూడా, అందులో విషయం ఉందని అర్థం అయింది, అందుకని ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

ranbir-rashmika.jpg

ఈరోజు ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేశారు. అయితే ఈ పాటని చూసాక, సందీప్ వంగా, ఈ 'యానిమల్' మొదట పోస్టర్ రణబీర్ లుక్ విడుదల చేసినప్పుడు ఎక్కువ హింస ఉండొచ్చు అని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పాటని చూసాక, సందీప్ ఈ సినిమాలో రొమాన్స్ కూడా చాలా ఎక్కువ పాళ్ళలో పెట్టినట్టుగా కనపడుతోంది. హిందీ పాట సన్నివేశంలో మధ్య మధ్యలో తెలుగు మాటలు కూడా పెట్టాడు సందీప్. రష్మిక మందన్న గీత అనే పాత్రలో కనపడనుంది, అయితే ఆమె తెలుగు అమ్మాయిగా సినిమాలో చేస్తోంది అని అర్థం అవుతోంది.

సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ దేవరకొండ (VijayDeverakonda) తో చేసి దర్శకుడిగా సెన్సేషనల్ క్రియేట్ చేసాడు, అలాగే అదే సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో షాహిద్ కపూర్ (ShahidKapoor) తో చేసి అక్కడ కూడా అదే సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు 'యానిమల్' సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నట్టుగా కనపడుతోంది. అందుకే ఇందులో 'అర్జున్ రెడ్డి' కన్నా ఓ పదింతలు ఎక్కువ రొమాన్స్, అలాగే దానికి తగ్గ వైలెన్స్ కూడా వుండబోతోంది అని అర్థం అవుతోంది. ఇందులో రష్మిక గీతాంజలి లేదా గీత పాత్రలో కనపడుతోంది అని అర్థం అవుతోంది.

ranbir-rashmika1.jpg

ఈ 'యానిమల్' సినిమా ఒక్క హిందీలోనే కాకుండా, దక్షిణాదిలో కూడా విడుదల చెయ్యడానికి చిత్ర నిర్వాహకులు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు ఈ పాటలో రణబీర్, రష్మికల లిప్ లాక్ సన్నివేశాలు, ముద్దులు ఓ రేంజ్ లో ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు. ఇక సినిమాలో ఇలాంటివి ఎన్ని పెట్టాడో అని కూడా సాంఘీక మాధ్యమంలో చర్చలు చేస్తున్నారు. రణబీర్ ని ఒక మాస్ అవతార్ లో సందీప్ చూపించనున్నాడు ఈ సినిమాలో, అలాగే ఈ సినిమా విడుదలైన టీజర్, పాటలో విజువల్స్ కూడా అదిరాయి.

రణబీర్, రష్మికల వివాహం ఇంట్లో వాళ్ళకి నచ్చలేదేమో, అందుకే తాము ఎంతకూ తెగించామో చెప్పడం కోసం, కుటుంబ సభ్యుల ముందే లిప్ లాక్ ఇద్దరూ పెట్టుకోవటం, ఆ తరువాత విమానం లో రొమాన్స్, ఇక పాటంతా కూడా వాళ్ళిద్దరి ఇంటిమసి సన్నివేశాలతో సందీప్ వంగా కుర్రకారుకి ఏమి కావాలో అన్నీ మసాలాలు ఈ సినిమాలో బాగా దట్టించినట్టు కనపడుతోంది. ఈ సినిమాలో అనిల్ కపూర్, (AnilKapoor) రణబీర్ కపూర్ తండ్రిగా, బాబీ డియోల్ (BobbyDeol) విలన్ గా కనిపించనున్నారు. 'పెళ్లి' ఫెమ్ పృథ్వి (Prudhvi) కూడా ఒక పాత్రలో కనిపించనున్నాడు అని తెలిసింది.

Updated Date - 2023-10-11T13:06:26+05:30 IST