Chatrapathi: రాజమౌళి పేరు ఈ హిందీ సినిమాకి మంచి అడ్వాంటేజ్ !

ABN , First Publish Date - 2023-03-27T13:06:20+05:30 IST

తెలుగులో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన 'ఛత్రపతి' ప్రభాస్ ని పెద్ద స్టార్ ని చేసింది. ఇప్పుడు ఇదే సినిమా హిందీ లో బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ సినిమాగా రీమేక్ చేస్తున్నాడు. దీనికి దర్శకుడు వి.వి. వినాయక్, ఈ సినిమా విడుదల తేదీ కూడా వచ్చేసింది. కానీ..

Chatrapathi: రాజమౌళి పేరు ఈ హిందీ సినిమాకి మంచి అడ్వాంటేజ్ !

సుమారు రెండు సంవత్సరాలు అయి ఉంటుంది బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) సినిమా విడుదల అయి. ఇంతకు ముందు 'అల్లుడు అదుర్స్' (Alludu Adurs) అనే సినిమా 2021 లో విడుదల అయింది. ఆ తరువాత అతను హిందీ పరిశ్రమలో అరంగేట్రం చెయ్యాలని రాజమౌళి (SS Rajamouli), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమా 'ఛత్రపతి' (Chatrapathi) ని ఎంచుకున్నాడు. దీనికి రాజమౌళి స్నేహితుడు, వి.వి. వినాయక్ (VV Vinayak) దర్శకుడు. గత కొంత కాలం నుండి ఈ హిందీ సినిమా విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు అని ఎదురు చూస్తున్నారు. దీనికి సమాధానంగా ఈ చిత్ర నిర్వాహకులు ఈ సినిమా మే 12 (May 12) న విడుదల అవుతుందని చెప్పారు.

chatrapathi.jpg

ఈ సినిమా సుమారు రెండు సంవత్సరాల క్రితం మొదలెట్టారు. షూటింగ్ కి చాలా టైం పట్టింది. ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి హిందీ సినిమా కాబట్టి, చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని వినిపిస్తోంది. కొన్ని కొన్ని సన్నివేశాలు బాగోలేకపోతే, మళ్ళీ రీషూట్ కూడా చేసారని తెలిసింది. మొత్తానికి షూటింగ్ అంతా అయిపొయింది, దర్శకుడు వి.వి. వినాయక్, కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు అవుట్ పుట్ తో చాలా సంతోషంగా వున్నారని తెలిసింది. అలాగే శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కూడా అవుట్ పుట్ చూసి చాల హ్యాపీ గా వున్నదని తెలిసింది.

అయితే శ్రీనివాస్ ఈ సినిమాని ఎందుకు ఎంచుకున్నాడు హిందీ ఆరంగేట్రం చెయ్యడానికి అంటే, ఈ సినిమాలో చాలా కమర్షియల్ ఎలెమెంట్స్ వున్నాయి అని అందుకే ఇది రీమేక్ చేస్తున్నాడని తెలిసింది. ఇందులో యాక్షన్, పాటలు, డాన్స్, అలాగే మదర్ సెంటిమెంట్ ఇలా అన్నీ వున్నాయి. దానికి తోడు దర్శకుడు వినాయక్ మాస్ సినిమాలు తీయటం లో అందెవేసిన చెయ్యి. అందుకని అతన్ని దర్శకుడిగా ఎంచుకొన్నారు. 'ఆర్.ఆర్.ఆర్' (RRR) ఆస్కార్ అవార్డు (Oscar Award) అందుకున్నాక రాజమౌళి పేరు ప్రపంచం అంతా మారుమోగుతోంది, అందుకని ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే రాజమౌళి పేరు వేస్తారని అంటున్నారు. అది ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని హిందీ లో ప్రేక్షకులు థియేటర్ కి రావటానికి ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నారు.

chatrapathi1.jpg

ఇవన్నీ ఒకటయితే, ఇంకొకటి శ్రీనివాస్ తెలుగు సినిమాలు హిందీ లో తర్జుమా చేసినపుడు యు ట్యూబ్ లో విపరీతంగా చూసారు. ఆలా ఇంకొక తెలుగు నటుడు హిందీలో ఆరంగేట్రం చేస్తున్నాడు. అయితే ఇతను ఈ ఒక్క సినిమా తో అపెస్తాడా, లేదా హిందీ సినిమాలు కంటిన్యూ చేస్తాడా లేదో చూడాలి.

Updated Date - 2023-03-27T13:06:21+05:30 IST