Raashii Khanna: ఊహకు అందని అనుభవాలు.. చెప్పకుండా ఉండలేకపోతున్నా!

ABN , First Publish Date - 2023-11-28T10:55:16+05:30 IST

రాశీఖన్నా.. (Raashii Khanna) భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాల్ని అందుకుంటూ కథానాయికగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు హిందీ చిత్రాలు, రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి. అయితే తెలుగు తెరపై కనిపించి రెండేళ్లు కావొస్తుంది.

Raashii Khanna: ఊహకు అందని అనుభవాలు.. చెప్పకుండా ఉండలేకపోతున్నా!

రాశీఖన్నా.. (Raashii Khanna) భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాల్ని అందుకుంటూ కథానాయికగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు హిందీ చిత్రాలు, రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి. అయితే తెలుగు తెరపై కనిపించి రెండేళ్లు కావొస్తుంది. ఈ నెల 30న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులు, సన్నిహితులతో సరదాగా ముచ్చటించింది. 'తెలుగు సినిమా ఎప్పుడూ' అంటూ రాశీఖన్నాపై  ప్రశ్నల వర్షం కురిపించారు అభిమానులు. "ప్రస్తుతం నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నా. తెలుగుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతా’ అని సమాధానమిచ్చింది రాశీఖన్నా. ప్రస్తుతం ఆమె విక్రమ్‌ మాస్సేకి జోడీగా ‘టీఎంఈ’(TME)లో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తైంది. ఈ సందర్భంగా చిత్రీకరణ అనుభవం, దర్శకుడు, సహనటులు ప్రోత్సహించిన తీరును వివరిస్తూ సోమవారం తన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ ఉద్వేగభరితమైన పోస్టును పెట్టింది. దర్శకుడు, హీరోలతో కలిసి ఉన్న ఓ ఫొటోను ముక్కలైన హృదయం ఎమోజీని జోడించి పోస్ట్‌ చేసింది.

Raashi-khanna-2.jpg

‘‘నా హృదయానికి ఎంతో దగ్గరైన ‘టీఎంఈ’ చిత్ర షూటింగ్‌ పూర్తైంది. ఇందులో నాది విచిత్రమైన పాత్ర. ఊహకందని మలుపులుండే ఓ అందమైన పాత్ర. కెమెరా ముందుకొచ్చినప్పుడు, ఆ పాత్రలో లీనమైనప్పుడు నా నరాలు లాగేసేవి. నాలో తుఫాను చెలరేగేది. కొన్ని సందర్భాల్లో మానసికంగా ఆ ప్రభావం నుంచి తేరుకోలేకపోయేదాన్ని. అంత బలంగా, ప్రభావితంగా ఉంటుందా పాత్ర. ఆ సమయంలో విక్రమ్‌ నాకు అండగా ఉన్నాడు. నటనలతో మెలకువలు చెప్పాడు. దర్శకుడైతే ప్రతి దశలో, ప్రతి సన్నివేశంలో నన్ను పాత్రలోకి పరకాయప్రవేశం చేసేలా చూశారు. ఈ ఉద్విగ్నత అనుభవాలను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా. ఇలాంటి భావన కలగడం ఇదే మొదటిసారి’’ అని అన్నారు.

Raashi.jpg

ప్రస్తుతం రాశీఖన్నా తమిళంలో ఆరణ్మనై-4, మేథావి, హిందీలో యోధ, టీఎంఈ చిత్రాలతో బిజీగా ఉంది. మరో పక్క ఈ నెల 30న రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా  అడ్వాన్స్  శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు.

Updated Date - 2023-11-28T10:56:28+05:30 IST