R Balki: ఇళయరాజా కథతో బయోపిక్‌.., ధనుష్‌ ఫస్ట్‌ ఛాయిస్‌!

ABN , First Publish Date - 2023-08-03T17:14:26+05:30 IST

సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) కథతో బయోపిక్‌ తీసే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 1400 చిత్రాలకుపైగా సంగీతం అందించిన ఆయన కథను సినిమాగా చూపించాలనే ఆలోచన బాలీవుడ్‌ (bollywood) దర్శకుడికి వచ్చింది.

R Balki: ఇళయరాజా కథతో బయోపిక్‌.., ధనుష్‌ ఫస్ట్‌ ఛాయిస్‌!

సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) కథతో బయోపిక్‌ తీసే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 1400 చిత్రాలకుపైగా సంగీతం అందించిన ఆయన కథను సినిమాగా చూపించాలనే ఆలోచన బాలీవుడ్‌ (bollywood) దర్శకుడికి వచ్చింది. ఇంగ్లిష్‌-వింగ్లిష్‌, షమితాబ్‌, పాడ్‌బ్యాన్‌ మిషన్‌ మంగళ్‌, తాజాగా లస్‌స్టోరీస్‌-2 సిరీస్‌లో ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించిన ఆర్‌ బాల్కీ (R abalki) ఈ చిత్రాన్ని తీయబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇళయరాజా పాత్రలో ధనుష్‌ని (Dhanush) హీరోగా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.


ధనుస్‌తో ‘షమితాబ్‌’ సినిమా తీశారు బాల్కీ. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా యాక్ట్‌ చేశారు. బాల్కీకి, ధనుస్‌కి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే ఇళయరాజాగా ధనుష్‌ని చూడాలని బాల్కీ ఆశపడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ బయోపిక్‌ తీయాలనుకుంటునట్లు బాల్కీ ప్రకటించారు. అదే వేదికగా ఇందులో ఇళయరాజాగా నటుడు ధనుష్‌ని అనుకుంటున్నట్లు తెలిపారు. ధనుష్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated Date - 2023-08-03T17:21:19+05:30 IST