కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Biggboss : ప్రెగ్నెన్సీ టెస్ట్‌ పాజిటివ్‌ అయితే.. ఎప్పటికీ గుర్తుండిపోతారు!

ABN, First Publish Date - 2023-11-16T20:08:32+05:30

బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే.. ఆమె భర్త విక్కీ  జైన్    బిగ్‌బాస్‌ 17లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే!  టాస్క్ లో భాగంగా ఇప్పటికే ఇంట్లో వీరిద్దరూ ఎన్నోసార్లు గొడవపడ్డారు. మళ్లీ ఆలుమగలుగా అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే తాజా ఎపిసోడ్‌లో భర్తతో కూర్చుని మాట్లాడుతూ అంకితా ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.

బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే(Ankita Lokhande).. ఆమె భర్త విక్కీ  జైన్(Vicky Jain) బిగ్‌బాస్‌ 17లో (Biggboss 17)సందడి చేస్తున్న సంగతి తెలిసిందే!  టాస్క్ లో భాగంగా ఇప్పటికే ఇంట్లో వీరిద్దరూ ఎన్నోసార్లు గొడవపడ్డారు. మళ్లీ ఆలుమగలుగా అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే తాజా ఎపిసోడ్‌లో భర్తతో కూర్చుని మాట్లాడుతూ అంకితా ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'నాకెందుకో ఆరోగ్యం బాగోలేదనిపిస్తోంది. ఈ నెల పీరియడ్స్‌ కూడా రాలేదు. నేను ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నా. మానసికంగా చాలా ఒత్తిడిగా ఉంది’’ అని భర్తతో చెప్పింది. అది విన్న విక్కీ 'నీకు పీరియడ్స్‌ వచ్చాయనుకున్నానే అనగానే.. 'నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? తెలియకుండా మాట్లాడటానికి?' అని ఫైర్ అయింది.  హౌస్‌లో మెడికల్‌ రూమ్‌కి తీసుకెళ్లి నాకు ప్రెగ్నెన్నీ టెస్ట్‌ చేశారు. రిపోర్ట్‌ ఏమీ ఇవ్వలేదు. తర్వాత బ్లడ్‌ టెస్‌, యూరిన టెస్ట్‌ చేశారు. ఆ రిపోర్ట్స్‌ కూడా ఇవ్వలేదు. అందుకే  టెన్షన్ గా ఉంది. ఇప్పుడు నా మనసులో భావన ఏంటనేది మాటల్లో చెప్పలేను. ఏమీ అర్థం కాకుండా ఉంది’’ అని భర్తతో చెప్పుకొచ్చింది.


ఒకవేళ ప్రెగ్నెన్నీ టెస్ట్‌ పాజిటివ్‌గా వస్తే బిగ్‌బాస్‌ హౌస్‌లో తల్లిదండ్రులు అయిన జంటగా విక్కీ - అంకితా లోఖండే గుర్తుండిపోతారు. సల్మానఖాన్  హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో అక్టోబర్‌ 15న మొదలైంది. అంకితా లోఖండే దివంగత సుశాంత్ సింగ్ రాజపుత్ తో కలిసి బాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటించింది. 2010లో ఆమె సుశాంత్ తో (Sushanth singh rajputh) డేటింగ్‌ చేసిందనే వార్తలూ వచ్చాయి. 2021లో అంకితా, విక్కీ  జైన్ ను పెళ్లి చేసుకుంది. 

Updated Date - 2023-11-16T20:08:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!