CarAccident: 50 అడుగుల లోయలో కారు పడిపోయి, ప్రముఖ హిందీ నటి మృతి

ABN , First Publish Date - 2023-05-24T14:26:36+05:30 IST

సారాభాయ్ వెర్సస్ సారాభాయ్ సీరియల్ లో నటించి మంచి పేరుతెచ్చుకున్న వైభవి ఉపాధ్యాయ నిన్న కారు ప్రమాదం లో మరణించారు. చిన్న వయసులోనే అంటే 33 ఏళ్ల వయసులోనే ఆమె ఇలా మరణించటం హిందీ టీవీ రంగంలో తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

CarAccident: 50 అడుగుల లోయలో కారు పడిపోయి, ప్రముఖ హిందీ నటి మృతి
Vaibhav Upadhyaya

ప్రముఖ హిందీ సీరియల్ 'సారాభాయ్ వెర్సస్ సారాభాయ్' తో మంచి పేరు తెచ్చుకున్న హిందీ నటి వైభవి ఉపాధ్యాయ (Vaibhavi Upadhyaya) కారు ప్రమాదంలో చనిపోయారు. ఈ సిరియాలో ఆమె హిందీ ప్రేక్షకులకు ఎంతో చేరువ అయ్యారు. సాంఘీక మాధ్యమాల్లో ఆమె మరణవార్త విని ప్రతి ఒక్కరూ స్పందిస్తూ, ఆమె మరణం తీరనిలోటని, ఇంత చిన్న వయస్సులోనే ఆమె హఠాన్మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యామని అంటున్నారు.

vaibhavupadhyaya1.jpg

ఏమి జరిగింది అంటే, #RIPViabhaviUpadhyaya వైభవి ఉపాధ్యాయ తనకి కాబోయే భర్తతో కారులో వెళ్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు. ఇది మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది అని తెలుస్తోంది. వైభవి తనకి టైము దొరికితే విహార యాత్రకు వెళ్లడం ఇష్టమని, ఈసారి హిమాచల్ ప్రదేశ్‌ లో అందమైన ప్రదేశాలను చూడటానికి వెళ్లారని తెలిసింది. మంగళవారం తనకు కాబోయే భర్త జై సురేష్ గాంధీతో కలిసి కారులో బయలుదేరారు అని కూడా తెలిసింది. హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలోని బంజర్‌ పట్టణంలో ఉన్న తీర్థన్ లోయ సందర్శనకు వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. అక్కడికి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఘాట్ రోడ్డులోని రోడ్డు నుండి సుమారు 50 అడుగుల లోతైన లోయలో పడిపోయింది అని అంటున్నారు.

వెంటనే స్థానికులు ఆ ఘటన ప్రదేశానికి చేరుకున్నా అప్పటికే వైభవి ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. ఆ తరువాత స్థానికులు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు, వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారని తెలిసింది. వైభవిని కాపాడలేకపోయారు, ఆమె కాబోయే భర్త జై సురేష్‌ను మాత్రం బయటికి తీయగలిగారు. అతనికి కూడా తీవ్ర గాయాలు వెంటనే దగ్గరలో వున్నా బంజర్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. స్థానిక పోలీసులు ఆమె సోదరుడుకి ఈ సమాచారం అందించారు, అతను వచ్చిన తరువాత వైభవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అతనికి అప్పగించారు. వైభవి 'సారాభాయ్ వెర్సస్ సారాభాయ్' #SarabhaiVsSarabhai సీరియల్ లోనే కాకుండా, సిఐడి #CID, అదాలత్ #Adaalat సీరియల్స్ లో కూడా నటించింది.

Updated Date - 2023-05-24T14:26:40+05:30 IST