ఈ ఏడాది మూడు!
ABN , First Publish Date - 2023-04-24T23:56:10+05:30 IST
‘పఠాన్’ చిత్ర విజయంతో మంచి జోరు మీదున్న షారుఖ్‌ఖాన్ ఈ ఏడాది మరో రెండు చిత్రాలతో తన అభిమానులను అలరించనున్నారు.

‘పఠాన్’ చిత్ర విజయంతో మంచి జోరు మీదున్న షారుఖ్‌ఖాన్ ఈ ఏడాది మరో రెండు చిత్రాలతో తన అభిమానులను అలరించనున్నారు. ‘పఠాన్’ చిత్రం ఈ ఏడాది జనవరి 25న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అలాగే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ చిత్రం జూన్ లో విడుదల కానుంది. ఇందులో నయనతార కథానాయిక. ఇక షారుఖ్ నటిస్తున్న మరో చిత్రం ‘దుంకీ’ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది. ఇలా ఒకే ఏడాది మూడు చిత్రాలతో షారుఖ్ సందడి చేయనున్నారు. తాప్సీ ప్రధాన పాత్రను పోషిస్తున్న ‘దుంకీ’ చిత్రంలో షారుఖ్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం షారుఖ్ కశ్మీర్ చేరుకున్నారు. సోనా మార్గ్‌లో సోమవారం నుంచి ఓ పాట చిత్రీకరిస్తున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘దుంకీ’ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ నిర్మిస్తున్నారు.