Pathaan: టిక్కెట్‌పై భారీ తగ్గింపు.. ఒక్క రోజు మాత్రమే ఆఫర్

ABN , First Publish Date - 2023-02-16T15:23:46+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). తాజాగా ఆయన నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల అయింది.

Pathaan: టిక్కెట్‌పై భారీ తగ్గింపు.. ఒక్క రోజు మాత్రమే ఆఫర్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). తాజాగా ఆయన నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల అయింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఆ కలెక్షన్స్‌ను మరింతగా పెంచే దిశగా మేకర్స్ అడుగులేశారు. టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఆఫర్ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

దేశంలోని మల్టిప్లెక్స్‌లలో రూ.110కే ‘పఠాన్’ టిక్కెట్‌ను మేకర్స్ అందించనున్నారు. ఒక్క రోజు మాత్రమే ఫిబ్రవరి 16న ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులందరు ‘పఠాన్’ డే సెలబ్రేషన్స్‌లో పాలు పంచుకోవాలని చెప్పారు. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీ టైమ్, ముక్తాఏ2 తదితర మల్టీప్లెక్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబడుతుంది. వరల్డ్ వైడ్‌గా రూ.963కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. టిక్కెట్ రేట్స్‌ను తగ్గించడంతో అతి త్వరలోనే ‘పఠాన్’ ఇండియాలో రూ.500కోట్ల క్లబ్‌లో చేరనుంది. గతంలో ‘బ్రహ్మస్త్ర’ మేకర్స్ ఇటువంటి ఆఫర్‌నే ప్రకటించగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.

‘పఠాన్’ ను యశ్ రాజ్ ఫిలిమ్స్ రూ.250కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించింది. సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించారు. దీపికా పదుకొణె (Deepika Padukone) జాన్ అబ్రహాం (John Abraham) కీలక పాత్రలు పోషించారు. ‘కింగ్’ ఖాన్ నాలుగేళ్ల తర్వాత వెండితెర పైకి ఎంట్రీ ఇవ్వడంతో మూవీపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మించి ‘పఠాన్’ బాక్సాఫీస్ వద్ద రాణించింది.

Updated Date - 2023-02-16T15:23:48+05:30 IST