Parinithi Chopra Wedding : పరిణితి పెళ్లి... మంత్రుల సందడి!

ABN , First Publish Date - 2023-09-24T17:07:09+05:30 IST

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణితీ చోప్రా పెళ్లి పీటలెక్కబోతుంది. ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాతో ఆమె వివాహం ఆదివారం సాయంత్రం 6.30 నిమిషాలకు జరగనుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో ప్రముఖులు సందడి చేశారు.

Parinithi Chopra Wedding : పరిణితి పెళ్లి... మంత్రుల సందడి!

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణితీ చోప్రా (parineethi chopra) పెళ్లి పీటలెక్కబోతుంది. ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాతో ఆమె వివాహం ఆదివారం సాయంత్రం 6.30 నిమిషాలకు జరగనుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో ప్రముఖులు సందడి చేశారు. ప్రీ-వెడ్డింగ్‌ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 90ల థీమ్‌ సాంగ్స్‌తో సంగీత్‌ నైట్‌ పేరిట ఏర్పాటు చేసిన సంగీత్‌లో ప్రముఖ గాయకుడు నవరాజ్‌ హన్స్‌ పంజాబీ ట్యూన్‌లకు సీఎం భగవంత్‌ మాన్‌ కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీRagడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

parithin.jpg

శనివారం నిర్వహించిన హల్దీ వేడుకలో పరిణీతి- రాఘవ్‌ సందడి చేశారు. పంజాబీ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. హల్దీ వేడుక మొదలుకొని పెళ్లి వేడుక వరకు విచ్చేేస అతిథుల కోసం ఆసియా, భారతీయ వంటకాలు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం 6.30గంటలలోపే ఈ స్టార్‌ జంట వివాహ వేడుక పూర్తి కానుంది. రాత్రి 8.30గంటలకు రిసెప్షన్‌ జరగనుంది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్ట్టింట సందడి చేస్తున్నాయి.

Updated Date - 2023-09-24T17:07:34+05:30 IST