కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parineeti Chopra : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం...

ABN, First Publish Date - 2023-09-25T12:13:15+05:30

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా వివాహం ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాతో వైభవంగా జరిగింది. ఆదివారం రాజాస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో వివాహబంధం ఒకటయ్యారు.

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా (parineethi Chopra) వివాహం ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాతో (Mp Raghav chadda) వైభవంగా జరిగింది. ఆదివారం రాజాస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో వివాహబంధం ఒకటయ్యారు. ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ సహా పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలని కల్యాణ వేదిక కళకళలాడింది. 22న వధువరులు కుటుంబాలు ఉదయ్‌పుర్‌ చేరుకున్నాయి. అదే రోజు మెహందీ, సంగీత్‌ వేడుకలు జరిగాయి. అందులో భాగంగా 90ల థీమ్‌ సాంగ్స్‌తో సంగీత్‌ నైట్‌ పేరిట ఏర్పాటు చేసిన సంగీత్‌లో ప్రముఖ గాయకుడు నవరాజ్‌ హన్స్‌ పంజాబీ ట్యూన్‌లకు సీఎం భగవంత్‌ మాన్‌ కాలు కదిపారు. ఆదివారం సాయంత్రం 6.30గంటల సమయంలో రాఘవ్‌ చద్దా పరిణితి మెడలో మూడుముళ్లు వేశారు. రాత్రి 8.30గంటలకు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. పెళ్లి వేడుకకు విచ్చేసిన అతిథుల కోసం ఆసియా, భారతీయ వంటకాలు ఏర్పాటు చేశారు.

రాఘవ్‌, పరిణీతి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. బాలీవుడ్‌ నటిగా పరిణీతి, యువ ఎంపీగా రాఘవ్‌ చద్దా రాజకీయాల్లో రాణిస్తున్నారు. వివాహం అనంతరం ఈ జంటను అంతా ‘రాగ్‌ణీతి’ అని పిలుస్తున్నారు.

తాజాగా పరిణీతి చోప్రా ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘మా మొదటి బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ నుంచి మా మనసులు ఏంటో తెలుసు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణమిది. అందరి బ్లెసింగ్స్‌తో ఇద్దరం భార్యభర్తలు అయ్యాం. ఒకరి కోసం ఒకరు బతుకుతాం. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తోపాటు పరిణీతి పోస్ట్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-09-25T12:14:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!