Nushrat bharucha : ఆందోళనలో సన్నిహితులు.. సురక్షితంగా..

ABN , First Publish Date - 2023-10-08T14:55:53+05:30 IST

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమం నిమిత్తం ఇజ్రాయెల్‌ (israel) వెళ్లిన బాలీవుడ్‌ నటి నుష్రత్‌ బరుచా (nushrat bharucha) ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ప్రస్తుతానికి ఆమె సురక్షితంగా ఉందని ఆమె సన్నిహితులు చెప్పారు.

Nushrat bharucha : ఆందోళనలో సన్నిహితులు.. సురక్షితంగా..

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమం నిమిత్తం ఇజ్రాయెల్‌ (israel) వెళ్లిన బాలీవుడ్‌ నటి నుష్రత్‌ బరుచా (nushrat bharucha) ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ప్రస్తుతానికి ఆమె సురక్షితంగా ఉందని ఆమె సన్నిహితులు చెప్పారు. ఆమె భారతకు పయనమైనట్లు వెల్లడించారు. హైఫా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నుష్రత్‌ ఇజ్రాయెల్‌ వెళ్లారు. ఆ దేశంలో యుద్థం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె సన్నిహితులు ఆందోళన చెందుతూ ఆమెకు ఫోన్‌ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. తానొక బేస్‌మెంట్‌లో సురక్షితంగానే ఉన్నానని ఆమె చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

Barcucha.gif

నిన్న మధ్యాహ్నాం తర్వాత ఆమె ఫోన్‌ స్పందించకపోవడంతో వారు కంగారుపడ్డారు. ‘రాయబార కార్యాలయం సహాయంతో మేం ఆమెతో టచ్‌లోకి వచ్చాం. ఆమె సురక్షితంగా భారతకు రానుంది. కానీ డైరెక్ట్‌ ఫ్లైట్‌ దొరకలేదు. కనెక్టింగ్‌ ఫ్లైట్‌లో ఆమె స్వదేశానికి చేరుకోనుంది. ఆమె భారతకు చేరుకోగానే మరిన్ని విషయాలు తెలియచేస్తాం’’ అని బరూచా టీమ్‌తెలిపింది.

ఇక తన సినీ జీవితం విషయానికొస్తే... శివాజీ హీరోగా నటించిన ుతాజ్‌మహల్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరచయమైంది. బాలీవుడ్‌లో మాత్రం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె రామ్‌సేతు, ఛత్రపతి చిత్రాల్లో నటించింది.

bachucha-2.gif

Updated Date - 2023-10-08T15:51:36+05:30 IST