Chatrapathi Twitter reaction: బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ మూవీ టీజర్ విడుదల.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2023-03-31T14:25:44+05:30 IST

టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బాలీవుడ్ బాట పట్టిన సంగతి తెలిసిందే.

Chatrapathi Twitter reaction: బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ మూవీ టీజర్ విడుదల.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..
Chatrapathi Twitter review

టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బాలీవుడ్ బాట పట్టిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ (V.V. Vinayak) దర్శకత్వంలో ‘ఛత్రపతి’ (Chatrapthi) అనే సినిమాని చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నటించిన సూపర్ హిట్ తెలుగు మూవీ ‘ఛత్రపతి’కి ఇది రిమేక్. నుస్రత్ బరుచా (Nushrratt Bharuccha) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ని, టీజర్‌ని మూవీ టీం తాజాగా విడుదల చేసింది. దీనిపై ట్విట్టర్ వేదికగా పలువురు నెటిజన్లు స్పందింస్తూ పోస్టులు పెడుతున్నారు. (Chatrapathi Twitter reaction)

ఈ టీజర్ గురించి బెల్లింకొండ ట్విట్టర్‌లో ఓ పోస్టుని షేర్ చేశాడు. అందులో.. ‘యాక్షన్ మొదలైంది. ఛత్రపతి టీజర్ వచ్చేసింది. మే 12న థియేటర్స్‌లో విడుదల అవుతుంది’ అని రాసుకొచ్చాడు. ఈ టీజర్‌ని చూసిన పలువరు నెటజన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ టీజర్ చూస్తుంటే.. రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. (#ChatrapathiTeaser)


‘‘దసరా’ మూవీ చూస్తున్నప్పుడూ ‘ఛత్రపతి’ టీజర్ చూసి సర్‌ఫ్రైజ్ అయ్యాను. ఛత్రపతిగా బెల్లంకొండ శ్రీనివాస్ బాగా సెట్ అయ్యాడు. ఈ చిత్రంతో వివి వినాయక్ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడు’ అని ఇంకొకరు రాసుకొచ్చారు. మరికొందరు సైతం మరో పాన్ ఇండియా స్టార్ రాబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ సైతం మాస్ ఉందని, బెల్లంకొండకి హిట్‌ దక్కాలని కోరుకుంటూ కామెంట్లు చేయడం విశేషం.

కాగా.. వి.వి.వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఇంతకుముందు, 2014లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అల్లుడు శ్రీను’ చిత్రానికి ఇద్దరు కలిసి మొదటిసారి పని చేశారు. ఆ మూవీనే శ్రీనివాస్‌కి తొలి చిత్రం. అనంతరం దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలిసి పని చేస్తున్నారు. అయితే.. ఇది కూడా శ్రీనివాస్‌కి బాలీవుడ్‌లో తొలి చిత్రమే కావడం విశేషం.

Updated Date - 2023-03-31T14:25:46+05:30 IST