సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nawazuddin Siddiqui: ‘ఓపిక నశించింది.. 25 కోట్లు ఇచ్చిన ఇకపై అలాంటి పాత్రలు చేయను’

ABN, First Publish Date - 2023-01-03T15:05:41+05:30

చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui). దాదాపు పది సంవత్సరాల క్రితం ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్‌’ (Gangs of Wasseypur) పాత్రతో మంచి పాపులారిటీ సాధించాడు.

Nawazuddin Siddiqui
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui). దాదాపు పది సంవత్సరాల క్రితం ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్‌’ (Gangs of Wasseypur) పాత్రతో మంచి పాపులారిటీ సాధించాడు. అయితే అంతకుముందు చాలా సినిమాల్లో చిన్న పాత్రలు (Small Roles), అతిథి పాత్రలు (Guest roles) చేస్తూ శ్రమించాడు. కాగా.. ఇటీవల ఈ నటుడు వరుసగా ప్రధాన పాత్రలు (Lead roles) చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ తరుణంలో తాజాగా చిన్న పాత్రలు చేయడంపై నవాజుద్దీన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

నవాజుద్దీన్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో ప్రారంభంలో చాలా సినిమాల్లో నేను చిన్న పాత్రలు చేశాను. కానీ ఇకపై చిన్న పాత్రలు చేయడం నావల్ల కాదు. ఇప్పుడు మీరు నాకు రూ.25 కోట్లు ఆఫర్ చేసినా నేను చిన్న పాత్ర చేయను’ అని చెప్పుకొచ్చాడు.

దానికి కారణాన్ని కూడా నవాజుద్దీన్ వివరిస్తూ.. ‘డబ్బు, కీర్తి మన పనికి వచ్చే బై ప్రోడక్ట్స్ మాత్రమేనని నేను భావిస్తున్నాను. మీరు మీ పనిని సరిగ్గా చేస్తే, డబ్బు, కీర్తి మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. మీరు వాటి వెంట పడితే, వాటిని మీరు ఎప్పటికీ చేరుకోలేరు. కాబట్టి మీ పనిని ఉత్తమంగా చేస్తూ వెళ్లండి. మనం కొన్నిసార్లు మన జీవితమంతా డబ్బు, కీర్తిని వెంట పరిగెత్తుతాం, కానీ అందుకోలేం. అందుకే ధనం, కీర్తి మీ బానిసలుగా మారి మీ వెంటే పరిగెత్తేలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలని నేను సూచిస్తాను’ అని తెలిపాడు. కాగా.. నవాజుద్దీన్ ప్రస్తుతం కంగనా రనౌత్ నిర్మాణంలో ‘టీకు వెడ్స్ షేరు’తో పాటు పలు ప్రాజెక్టులతో కెరీర్‌లో బిజీగా ఉన్నాడు.

Updated Date - 2023-01-03T15:06:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!