Nana Patekar: ప‌బ్లిక్‌లో యువ‌కుడిని చాచి కొట్టిన.. ర‌జ‌నీకాంత్ విల‌న్‌

ABN , First Publish Date - 2023-11-15T18:43:30+05:30 IST

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు నానాప‌టేక‌ర్ (nana patekar) మ‌రోమారు వివాదంలో చిక్కుకున్నాడు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో త‌న విభిన్న ప్ర‌వ‌ర్త‌న‌తో ఎప్పుడు ఎక్క‌డో ఓ చోట వార్త‌ల కెక్క‌డం ఆయ‌న స‌ర్వ‌సాధారణంగా మారింది. గ‌తంలో మీటూ ఆరోప‌ణ‌లతో కొంత‌కాలం వార్త‌ల్లో నిలిచిన ఆయ‌న మ‌ళ్లీ ఇప్పుడు ప‌బ్లిక్‌లో ఓ యువ‌కుడిని కొట్టి వార్త‌ల్లో నిలిచారు.

Nana Patekar: ప‌బ్లిక్‌లో యువ‌కుడిని చాచి కొట్టిన.. ర‌జ‌నీకాంత్ విల‌న్‌
nana patekar

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు నానాప‌టేక‌ర్‌(nana patekar) మ‌రోమారు వివాదంలో చిక్కుకున్నాడు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో త‌న విభిన్న ప్ర‌వ‌ర్త‌న‌తో ఎప్పుడు ఎక్క‌డో ఓ చోట వార్త‌ల‌కెక్క‌డం ఆయ‌న స‌ర్వ‌సాధారణంగా మారింది. గ‌తంలో మీటూ ఆరోప‌ణ‌లతో కొంత‌కాలం వార్త‌ల్లో నిలిచిన ఆయ‌న మ‌ళ్లీ ఇప్పుడు ప‌బ్లిక్‌లో ఓ యువ‌కుడిని కొట్టి వార్త‌ల్లో నిలిచారు. ఈయ‌న ర‌జ‌నీకాంత్ న‌టించిన కాలా సినిమాలో విల‌న్‌గా న‌టించి సౌత్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు.

విష‌యానికి వ‌స్తే.. నానాప‌టేక‌ర్ తాజాగా న‌టిస్తున్న జ‌ర్నీ(journey) చిత్రం షూటింగ్ వార‌ణాసిలో జ‌రుగుతున్న‌ది. గ‌ద‌ర్‌, గ‌ద‌ర్‌2 వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన అనీల్ శ‌ర్మ(Anil Sharma) త‌న కుమారుడు ఉత్క‌ర్ష్ శ‌ర్మ‌ను సోలో హీరోగా ప‌రిచ‌యం చేస్తూ జ‌ర్నీ అనే సినిమా మొద‌లుపెట్టాడు. ఈసినిమాలో నానా ప‌టేక‌ర్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా వార‌ణాసిలో గ‌త వారం ప‌ది రోజులుగా ఆయ‌న‌పై కొన్ని ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.


ఈక్ర‌మంలో బుధ‌వారం కూడా నానా ప‌టేక‌ర్‌, ఇత‌ర తారాగ‌ణంపై స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తుండ‌గా మ‌ధ్య‌లో ఓ అభిమాని సెల్ఫీ కోసం ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా ఒక్క‌సారిగా కోపంతో ఆ యువ‌కుడి త‌ల వెనుక గ‌ట్టిగా ఓ దెబ్బ కొట్టాడు. అక్క‌డే ఉన్న బాడీగార్డ్స్ గ‌మ‌నించి ఆ యువ‌కుడిని ప‌క్క‌కు తీసుకెళ్లారు.

ఈ ఘ‌ట‌న ఓ నెటిజ‌న్ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఇప్పుడు అంత‌టా ట్రెండింగ్ అవుతున్న‌ది. ఇలాంటి న‌టుల‌నా మ‌నం అభిమానించేది అంటూ నెటిజ‌న్స్‌ ఓ రేంజ్‌లో సీరియ‌స్ అవుతున్నారు.అయితే ఈ న్యూస్‌పై ద‌ర్శ‌కుడు అనీల్ శ‌ర్మ స్పందిస్తూ అది షూటింగ్‌లో భాగంగానే చిత్రీక‌రించామ‌ని, స‌ద‌రు వార్త వైర‌ల్ రావ‌డం ప‌బ్లిక్ స్టంట్ మాత్ర‌మే అని వెల్ల‌డించారు.

Updated Date - 2023-11-15T19:38:43+05:30 IST