Vivek Agnihotri: వ్యాక్సిన్ వార్ సినిమాలో కీలక పాత్రలో ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-01-01T19:14:12+05:30 IST

‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files)కు దర్శకత్వం వహించి ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.

Vivek Agnihotri: వ్యాక్సిన్ వార్ సినిమాలో కీలక పాత్రలో ఎవరంటే..?

‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files)కు దర్శకత్వం వహించి ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. లో బడ్జెట్‌లో రూ.15కోట్లతో మూవీని రూపొందించగా రూ.250కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో వివేక్ నుంచి వచ్చే నెక్ట్స్ మూవీ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Nana-Patekar.jpg

వివేక్ అగ్నిహోత్రి కొన్ని నెలల క్రితమే కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War) అని టైటిల్ పెట్టాడు. రెండు వారాల క్రితమే సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (Nana Patekar) కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర సరికొత్తగా ఉంటుందట. ఈ రోల్‌ను చేయడానికి అతను కూడా ఎంతగానో కష్టపడుతున్నాడని తెలుస్తోంది. కాగాా.. ఈ మూవీలో అనుపమ్ ఖేర్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆయనే కన్‌ఫార్మ్ చేశారు. ఇది ఆయనకి 534వ చిత్రం. కాగా.. ఈ సినిమాలో వివేక్ భార్య పల్లవి జోషితో పాటు గోపాల్ సింగ్, దివ్య సేథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం లక్నోలో జరుగుతున్నట్టు సమాచారం. కోవిడ్‌తో ఇండియా ఏ విధంగా పోరాటం చేసిందనేది ఈ చిత్రంలో చూపించనున్నారట. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - 2023-01-02T15:22:13+05:30 IST