Kunal Thakur : కునాల్‌ - ముక్తి మోహన్‌ ఒకటయ్యారు!

ABN , First Publish Date - 2023-12-11T09:42:53+05:30 IST

బాలీవుడ్‌ నటుడు కునాల్‌ ఠాకూర్‌(Kunal Thakur) వివాహం చేసుకున్నాడు. నటి ముక్తి మోహన్‌ను (Mukti Mohan) ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్‌ వేదికగా పెళ్ళి ఫొటోలను షేర్‌ చేశారు. అభిమానుల బ్లెస్సింగ్స్‌ కావాలని కోరారు

Kunal Thakur : కునాల్‌ - ముక్తి మోహన్‌ ఒకటయ్యారు!

బాలీవుడ్‌ నటుడు కునాల్‌ ఠాకూర్‌(Kunal Thakur) వివాహం చేసుకున్నాడు. నటి ముక్తి మోహన్‌ను (Mukti Mohan) ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్‌ వేదికగా పెళ్ళి ఫొటోలను షేర్‌ చేశారు. అభిమానుల బ్లెస్సింగ్స్‌ కావాలని కోరారు. నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కబీర్‌ సింగ్‌, యానిమల్‌ తదితర చిత్రాల్లో కునాల్‌ ఠాకూర్‌ నటించాడు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్‌ (animal) సినిమాలో రష్మిక మందన్నతో నిశ్చితార్థం చేసుకునే అబ్బాయిగా కునాల్‌ కనిపించాడు.

Kunal-2.jpg

ముక్తి మోహన్‌ కూడా బాలీవుడ్‌లో నటనతోపాటు మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. లస్ట్‌ స్టోరీస్‌ 2, థార్‌ వంటి సినిమాల్లో కూడా ఆమె మెప్పించింది. తెలుగులో రవితేజ ‘దరువు’ చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌లో కనిపించింది. దిల్‌ హై హిందుస్తానీ 2 బుల్లితెర ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కనిపిస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్‌ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రిలీజ్‌ అయిన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వరల్డ్‌వైడ్‌ పది రోజుల్లో రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-12-11T10:23:31+05:30 IST