Mrunal Thakur marriage: బాద్ షా తో పెళ్లా? ఇదే ఆ ప్రశ్నకి సమాధానం

ABN , First Publish Date - 2023-11-14T14:45:52+05:30 IST

'సీతారామం' నటి మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ సింగర్, నటుడు బాద్ షా తో రిలేషన్ షిప్ లో ఉందని, త్వరలోనే వివాహం కూడా చేసుకుంటుంది అని వార్తలు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. దీనికి బాద్ షా ఇచ్చిన సమాధానం ఏంటంటే...

Mrunal Thakur marriage: బాద్ షా తో పెళ్లా? ఇదే ఆ ప్రశ్నకి సమాధానం
Mrunal Thakur with Badshah

మృణాల్ ఠాకూర్ (MrunalThakur) తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న నటి. 'సీతరామం' #SitaRamam సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసి, మొదటి సినిమాతో మంచి ప్రతిభ గల నటి అనిపించుకున్న మృణాల్ ఇప్పుడు పలు తెలుగు సినిమాలతో బిజీగా వుంది. నానితో (Nani) చేసిన 'హాయ్ నాన్న' #HiNanna సినిమా విడుదలకి సిద్ధంగా వుంది. అలాగే విజయ్ దేవరకొండతో (VijayDeverakonda) 'ఫామిలీ స్టార్' #FamilyStar సినిమా కూడా చేస్తోంది. ఇటు తెలుగులోనే కాకుండా, అటు హిందీలో కూడా బిజీ గా ఉంటోంది. వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది మృణాల్ ఠాకూర్.

mrunalthakurbadshah.jpg

కొన్ని రోజుల క్రితం దీపావళి పండగ సందర్భంగా నటి శిల్ప శెట్టి (ShilpaShetty) ఒక పార్టీ ఇచ్చింది, ఆ పార్టీకి మృణాల్ (MrunalThakur), సింగర్, నటుడు అయిన బాద్ షా (Badshah) కూడా వచ్చాడు. అతని అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ (AdityaPratikSingh). ఆ పార్టీలో కొన్ని ఫోటోలను మృణాల్ తన సాంఘీక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ, వీళ్ళందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు అని చెప్పింది. అందులో బాద్ షా కూడా వున్నాడు. పార్టీ అయిన ఆతరువాత మృణాల్, బాద్ షా కొంచెం సన్నిహితంగా కనపడటంతో, ఇంకేముంది వెంటనే వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో వున్నారు, ఇక మృణాల్ ఠాకూర్ అతడినే పెళ్లి కూడా చేసేసుకుంటుంది అని వార్తలు వచ్చేసేయి.

badshah.jpg

ఇంకేముంది సాంఘీక మాధ్యమంలో ఈ వార్త వైరల్ అయింది. ఇక దీనిమీద బాద్ షా స్పందించాల్సిన అవసరం వుంది అనుకున్నాడు, అందుకే వెంటనే తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ ని పోస్ట్ చేసాడు. "డియర్ ఇంటర్నెట్ మిమ్మల్ని మరోసారి నిరాశకు గురిచేస్తున్నందుకు నన్ను క్షమించు. ప్రస్తుతం వస్తున్న ఈ వార్తల్లలో ఏదీ నిజం కాదు," అని చెప్పాడు. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం 'హాయ్ నాన్న' ప్రచారాలు చేస్తోంది, ఇది ఒక్క తెలుగులోనే కాకుండా, మిగతా అన్ని భాషల్లో కూడా విడుదలవుతోంది.

Updated Date - 2023-11-14T14:45:54+05:30 IST