Joram: స‌ర్వైవ‌ల్‌ థ్రిల్లర్‌తో వ‌స్తున్న మ‌నోజ్‌బాజ్‌పాయ్.. ఎప్పుడంటే

ABN , First Publish Date - 2023-11-08T16:49:26+05:30 IST

సినీ అభిమానుల‌ను అల‌రించేందుకు మ‌రో స‌ర్వైవ‌ల్‌, హై టెన్ష‌న్‌ థ్రిల్లర్ సినిమా సిద్ధ‌మ‌యింది. మూడు సార్లు జాతీయ ఆవార్డులు పొందిన విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్‌బాజ్‌పాయ్ ప్ర‌ధాన పాత్ర‌దారుడిగా రూపొందించిన చిత్రం జోరమ్. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప‌లు ఆవార్డులు సైతం గెలుచుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 8న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Joram: స‌ర్వైవ‌ల్‌ థ్రిల్లర్‌తో వ‌స్తున్న మ‌నోజ్‌బాజ్‌పాయ్.. ఎప్పుడంటే
joram

సినీ అభిమానుల‌ను అల‌రించేందుకు మ‌రో స‌ర్వైవ‌ల్‌, హై టెన్ష‌న్‌ థ్రిల్లర్ సినిమా సిద్ధ‌మ‌యింది. మూడు సార్లు జాతీయ ఆవార్డులు పొందిన విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్‌బాజ్‌పాయ్ (Manoj Bajpayee ) ప్ర‌ధాన పాత్ర‌దారుడిగా రూపొందించిన చిత్రం ‘జోరమ్’ (Joram). దెవాన్సిస్ మ‌కీజా ద‌ర్వ‌క‌త్వం వ‌హించ‌గా జీ స్టూడియో (Zee Studios) నిర్మించింది.ఇప్పటికే అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పలు ఆవార్డులు సైతం గెలుచుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 8న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. కాగా మ‌కీజా, మ‌నోజ్ కాంబినేష‌న్‌లో ఇది మూడో చిత్రం కావ‌డం గ‌మ‌నార్హం.

నిస్సాహ‌యిడైన ఓ సామాన్య మ‌నిషి చిన్న పాప‌తో త‌న‌ను ఎలాగైనా చంపాల‌ని చూస్తున్న‌ పాత, కొత్త విరోధుల‌ను ఎదుర్కొంటూ పోరాటం ఎలా చేశాడ‌నే ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. అయితే ‘నేను ఎంతో ఇష్ట‌ప‌డి, క‌ష్ట‌ప‌డి ఈ చిత్రంలో న‌టించాన‌ని నాకు ఈ సినిమా చాలా చాలా ప్ర‌త్యేక‌మంటూ’ మ‌నోజ్ చాలా వేదిక‌ల‌పై చెబుతూ వ‌స్తుండ‌డంతో ఈ సినిమాపై సినీ అభిమానుల‌కు ప్ర‌త్యేక అభిప్రాయం ఏర్ప‌డింది.


ఆర్జీవీ స‌త్య సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా పేరుప్ర‌తిష్ట‌లు సంపాదించిన మ‌నోజ్ ఆ సినిమాకు జాతీయ అవార్డు ద‌క్కించుకుని వెలుగులోకి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాల‌లోనే ఎక్కువ‌గా న‌టిస్తూ అభిమానుల‌ను సంపాదించి ఇండియా బెస్ట్ న‌టుల్లో ఒక‌డిగా నిలిచాడు.

సుమంత్ హీరోగా చేసిన‌ ప్రేమ‌క‌థ సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన మ‌నోజ్ బాజ్‌పాయ్ ఆ త‌ర్వాత‌ అల్లు ఆర్జున్ హీరోగా వ‌చ్చిన హ్యాపీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ కొమ‌రం పులి సినిమా ద్వారా తెలుగు వారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఇటీవ‌ల అమెజాన్ ది ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్‌తో త‌న ఫ‌రిధిని మ‌రింత‌గా పెంచుకున్నాడు. రియ‌లిస్టిక్‌, వివాదాస్ప‌ద చిత్రాల్లో ఎక్కువ‌గా న‌టించే మ‌నోజ్ ‘జోర‌మ్’ అనే మ‌రో ఇంట్ర‌స్టింగ్ స‌బ్జెక్ట్‌తో రణబీర్ కపూర్ ‘యానిమల్’, విక్కీ కౌషల్ ‘షామ్ బహాదూర్’ వంటి భారీ చిత్రాలతో పోటీ పడుతున్నాడు.

Updated Date - 2023-11-08T17:08:42+05:30 IST