MalaikaAroraKhan: మంచం మీద అర్ధనగ్నంగా కాబోయే భర్త ఫోటో వైరల్, నెటిజన్స్ ఏమంటున్నారు అంటే..

ABN , First Publish Date - 2023-05-30T10:07:35+05:30 IST

మలైకా అరోరా ఖాన్ మొదటి భర్త అర్బాజ్ ఖాన్ తో విడిపోయాక, తనకన్నా పన్నెండేళ్ళు చిన్నవాడు అయిన అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. ఇప్పుడు అతన్ని పెళ్లి కూడా చేసుకుంటాను అంటోంది. అయితే ఈలోపే తన బెడ్ రూమ్ లో అర్జున్ కపూర్ అర్థనగ్నంగా వున్న ఫోటోని తన ఇన్స్టాగ్రమ్ స్టోరీ లో షేర్ చేసి సంచలనం సృష్టించింది.

MalaikaAroraKhan: మంచం మీద అర్ధనగ్నంగా కాబోయే భర్త ఫోటో వైరల్, నెటిజన్స్ ఏమంటున్నారు అంటే..
Malaika Arora Khan

మలైకా అరోరా ఖాన్ (MalaikaAroraKhan) బాలీవుడ్ లో ఒక సంచలనం. ఆమె ఎప్పుడు ఏమి చేసినా చాలా బోల్డ్ గా చేస్తుంది. ఆమె సాంఘీకమాధ్యమాల్లో తన బోల్డ్ ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో అన్నీ విషయాలు పంచుకుంటూ ఉంటుంది. 49 ఏళ్ల వయసులో కూడా అందం ఇసుమంతైనా తరిగిపోకుండా, తన ఫిజిక్ ని కాపాడుకుంటూ చాలా గ్లామర్ గా ఉంటుంది. మొదటి భర్త సల్మాన్ ఖాన్ (SalmanKhan) తమ్ముడు అర్భాజ్ ఖాన్ (ArbaazKhan) ని విడిచిపెట్టి ఇప్పుడు తనకన్నా 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ (ArjunKapoor) తో డేటింగ్ లో వుంది.

malaikaarorakhan2.jpg

అయితే అర్జున్ కపూర్ ని త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని కూడా అంటోంది ఈ భామ. తెలుగు వాళ్ళకి కూడా చాలా సుపరిచితం ఈ బాలీవుడ్ సుందరి. పవన్ కళ్యాణ్ (PawanKalyan) నటించిన 'గబ్బర్ సింగ్' (GabbarSingh) సినిమాలో 'కెవ్వు కేక' (KevvuKeka) పాటతో తెలుగు ప్రేక్షకులను కూడా ఉర్రూత లూగించిన ఈ బాలీవుడ్ సుందరి ఇప్పుడు వార్తల్లో వుంది.

ఇంతకీ ఏమైంది అంటే, ఆమె ఒక తన సాంఘీక మాధ్యమం అయినా ఇన్స్టాగ్రమ్ లో ఒక స్టోరీ పెట్టింది. అందులో తన బాయ్ ఫ్రెండ్, కాబోయే భర్త అయినా అర్జున్ కపూర్ ఫోటో బెడ్ మీద వున్నది పెట్టింది. #MalaikaAroraKhan అందులో అర్జున్ కపూర్ ఆల్మోస్ట్ నగ్నంగా వున్నాడు, ఒక చిన్న పిల్లో మాత్రమే అడ్డం పెట్టింది. ఆ ఫోటో పెట్టి 'మై లేజీ బాయ్' అన్న కేప్షన్ కూడా పెట్టింది.

malaikaarorakhan.jpg

ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. దీనిమీద నెటిజన్స్ అందరూ మండిపడుతున్నారు. ఇలా ఎవరైనా బెడ్ రూమ్ విషయాలు బయటకి చూపెడతారా, చెప్తారా అంటూ ఆమె మీద నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మలైకా, అర్బాజ్ ఖాన్ లకి ఒక కొడుకు కూడా వున్నాడు, అతనిప్పుడు టీనేజ్ లో వున్నారు. ఆలా టీనేజ్ లో వున్న కొడుకు ఉంటూ ఇలా ఎలా ఫోటోస్ షేర్ చేస్తావు అని నెటిజన్స్ ఒక పక్క మలైకాని అడుగుతున్నారు. ఏమైనా ఈ ఫోటో ఇప్పుడు సెన్సేషనల్ అయింది.

Updated Date - 2023-05-30T10:07:35+05:30 IST