The Family man: సిరీస్‌-3 ఎప్పుడంటే!

ABN , First Publish Date - 2023-08-15T13:22:53+05:30 IST

‘ది ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌ ఓటీటీ వేదికగా భారతీయ ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే! ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విశేషంగా అలరించాయి. ఇప్పుడు మూడో సీజన్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు. దీనిపై సిరీస్‌ రూపకర్తలు రాజ్‌ అండ్‌ డీకే స్పందించారు.

The Family man: సిరీస్‌-3 ఎప్పుడంటే!

‘ది ఫ్యామిలీమ్యాన్‌’ (The Family Man) సిరీస్‌ ఓటీటీ వేదికగా భారతీయ ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే! ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విశేషంగా అలరించాయి. ఇప్పుడు మూడో సీజన్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు. దీనిపై సిరీస్‌ రూపకర్తలు రాజ్‌ అండ్‌ డీకే (Raj and DK) స్పందించారు. ఈ ఏడాది చివరి నాటికి ఫ్యామిలీమ్యాన్‌-3’ (The Family man -3) మొదలుపెట్టనున్నట్తు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ స్ర్టీమింగ్‌ కానున్న నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో రాజ్‌ అండ్‌ డీకే ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘‘ప్రస్తుతం మా ముందు చాలా అంశాలున్నాయి. ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ స్ర్టీమింగ్‌కు సిద్థంగా ఉంది. ఇది అయిన వెంటనే ‘ఫ్యామిలీమ్యాన్‌-3’ పనులు మొదలుపెడతాం. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్తాం. తదుపరి చిత్రం ‘ఫర్జీ2’కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం మా దృష్టి అంతా ఫ్యామిలీ మ్యాన్‌-3’ పైనే. ‘సిటాడెల్‌’ దాదాపు పూర్తయింది. పలు ఇబ్బందులను అధిగమించి దిగ్విజయంగా పూర్తి చేశాం. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది’’ అని అన్నారు.

వరుణ్‌ ధావన్‌, సమంత కీలక పాత్రల్లో నటించారు. ‘ది ఫ్యామిలీ వ్యన్‌’ సిరీస్‌ స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే కథ. థ్రెట్‌ అనాలసిస్‌ అండ్‌ సర్వైవలెన్స్‌ సెల్‌ విభాగంలో శ్రీకాంత్‌ తివారీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. భారత్‌పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు, సంఘ విద్రోహక శక్తులు పన్నే కుట్రలను ముందుగానే ఛేదించి వారి ఆట కట్టించడం టీఏఎస్‌సీ పని. ఇక మూడో భాగంలో చైనా నుంచి భారత్‌కు ఎదురయ్యే విపత్కర పరిస్థితులపై మనోజ్‌ తివారీ ఆయన బృందం పోరాటం చేయనుందని తెలుస్తోంది.

Updated Date - 2023-08-15T13:22:53+05:30 IST