Keerthy - Varun : ఆటోలో ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు?

ABN , First Publish Date - 2023-09-23T19:23:03+05:30 IST

సినీ సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనమే అవుతుంది. అదే ఓ హీరోహీరోయిన్‌ కలిసి కనిపిస్తే.. క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. లెక్కలేనని రూమర్లు పుట్టకొచ్చేస్తాయి. తాజాగా కీర్తి సురేశ్‌కు సంబంధించిన ఓ వార్త ఇలాగే వైరల్‌ అవుతోంది.

Keerthy - Varun : ఆటోలో ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు?

సినీ సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనమే అవుతుంది. అదే ఓ హీరోహీరోయిన్‌ కలిసి కనిపిస్తే.. క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. లెక్కలేనని రూమర్లు పుట్టుకొచ్చేస్తాయి . తాజాగా కీర్తి సురేశ్‌కు (keerthy suresh) సంబంధించిన ఓ వార్త ఇలాగే వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌తో (vaun dhavan) కలిసి ఈ మలయాళ బ్యూటీ ఆటోలో షికారుకు వెళ్లింది. ఆ ఫొటో వైరల్‌ కావడంతో పెద్ద చర్చకు దారితీసింది. కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రానున్న ఓ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. ఆమెకిది తొలి హిందీ సినిమా.

జవాన్‌ విజయోత్సహంలో ఉన్న అట్లీ అదే ఉత్సాహంతో ఈ చిత్రాన్ని శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఈ షూటింగ్‌లో భాగంగానే వరుణ్‌, కీర్తి ఇద్దరూ ఇలా ఆటోలో ప్రయాణించినట్లు సమాచారం. సడెన్‌గా వీరిద్దరూ ఆటోలో చక్కర్లు కొడుతున్న ఫొటో బయటకు రావడంతో అందరి దృష్టి వారిపైనే పడింది. అట్లీ ఈ చిత్రాన్ని పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం హీరోహీరోయిన్‌లపై భావోద్వేగ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. తమిళంలో హిట్‌ అయిన ‘తేరి’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతుందని టాక్‌ వినిపిస్తోంది.

Updated Date - 2023-09-23T19:47:34+05:30 IST